డొమెస్టిక్ వర్కర్స్ రెసిడెన్సీ నిబంధన మళ్లీ ప్రారంభం
- December 19, 2021
కువైట్: దేశంలో కరోనా తీవ్రత తగ్గి ఇప్పుడిప్పుడే సాధారణ పరిస్థితులు నెలకొంటున్నాయి. ఈ నేపథ్యంలో ఆరు నెలలకు పైగా దేశం వెలుపల ఉండే డొమెస్టిక్ వర్కర్స్ రెసిడెన్సీని రద్దు చేసే ఆర్టికల్ (20) ని తిరిగి ప్రారంభిస్తున్నట్లు రెసిడెన్సీ వ్యవహారాల విభాగం ప్రకటించింది. ఆరు నెలల కాలాన్ని డిసెంబర్ 1, 2021 నుండి లెక్కించనున్నట్టు వెల్లడించింది. గతంలో కరోనా మహమ్మారి నేపథ్యంలో విమాన ప్రయాణాలపై ఆంక్షలు, ఎయిర్ పోర్టుల మూసివేత తదితర కారణాలతో ఈ నిబంధనను టెంపరరీగా నిలిపివేశారు. అయితే డొమెస్టిక్ వర్కర్స్ రెసిడెన్సీని ఆరు నెలల కంటే ఎక్కువ కాలం పొడిగించాలనుకునే పౌరులు.. ఆరు నెలల టైం ముగిసేలోపు ప్రత్యేకంగా అనుమతి కోసం దరఖాస్తు చేసుకోవాలని పరిపాలన విభాగం స్పష్టం చేసింది.
తాజా వార్తలు
- తెలంగాణకు జాతీయ రహదారుల ప్రాజెక్టులకు కేంద్రం గ్రీన్ సిగ్నల్
- టీ20 వరల్డ్ కప్ షెడ్యూల్ వచ్చేసింది..
- ఏపీలో మూడు కొత్త జిల్లాలు
- 5.17 మిలియన్లకు పెరిగిన కువైట్ జనాభా..!!
- హైలే గోబీ వోల్కానో విస్ఫోటనం.. సౌదీ అరేబియా సేఫేనా?
- ఫ్రెండ్లీ వాతావరణంలో నిర్మాణాత్మక సంస్కరణలు..!!
- డిసెంబర్లో పెట్రోల్ ధరలు తగ్గుతాయా?
- ఖతార్తో గోవా పర్యాటక సంబంధాలు..!!
- అరేబియా సముద్రం పై వొల్కానిక్ యాష్..ఒమన్ అలెర్ట్..!!
- WTITC గ్లోబల్ ట్రేడ్ & ఇన్వెస్ట్మెంట్ వింగ్ సెక్రటరీగా శ్రీకాంత్ బడిగ నియామకం







