ఆర్థిక సహాయక చర్యలు మరో ఆరు నెలలు పొడగింపు
- December 19, 2021
యూఏఈ: కొత్త రుణాలు, ఆర్థిక వ్యవస్థ వేగంగా కోలుకునేందుకు కరోనా మహమ్మారి సమయంలో ప్రకటించిన ఉద్దీపన చర్యలను యూఏఈ సెంట్రల్ బ్యాంక్ మరో ఆరు నెలల పాటు పొడిగించింది. టార్గెటెడ్ ఎకనామిక్ సపోర్ట్ స్కీమ్ (టెస్)ను జూన్ 30, 2022 వరకు కొనసాగించనున్నట్లు ప్రకటించింది.ఈ స్కీం ద్వారా బ్యాంకుల క్యాపిటల్ బఫర్ నిల్వలు, లిక్విడిటీ,స్టెబుల్ ఫండింగ్ రిక్వైర్ మెంట్లలో వెసులుబాటును కల్పించారు.ముఖ్యంగా దేశీయ బ్యాంకులకు క్యాపిటల్ బఫర్ కింద లిక్విడిటీ చర్యలు, లిక్విడిటీ కవరేజ్ రేషియో, ఎలిజిబుల్ లిక్విడ్ అసెట్స్ రేషియో, నెట్ స్టెబుల్ ఫండింగ్ రేషియో, అడ్వాన్సెస్ టు స్టేబుల్ రిసోర్స్ రేషియోపై తాత్కాలిక ప్రూడెన్షియల్ రిలీఫ్‌ను సెంట్రల్ బ్యాంకు అందిస్తోంది.కరోనా సమయంలో ఆర్థిక వ్యవస్థకు జరిగిన డ్యామేజ్ ను ఈ చర్యల తో తిరిగి గాడిలో పెట్టవచ్చని సెంట్రల్ బ్యాంక్ ధీమగా ఉంది.
తాజా వార్తలు
- వైరల్ వీడియోల పై ఒమన్ పోలీసులు దర్యాప్తు.. చట్టపరమైన చర్యలకు సిద్ధం
- ఎన్నిక ఏదైనా కూటమిదే ఘనవిజయం: మంత్రి కందుల దుర్గేష్
- దుబాయ్ మెరీనాలో 670 మంది కార్మికులకు భద్రత, సామాజిక అవగాహన కార్యక్రమాలు
- గ్లోబల్ విలేజ్ సీజన్ 31 VIP ప్యాక్‌లు విడుదల.. పరిమిత సంఖ్యలో విక్రయాలు
- గల్ఫ్ ప్రవాసులకు ఆన్లైన్లో ఓపెన్ యూనివర్సిటీ కోర్సులు
- OMCAP ఆధ్వర్యంలో జర్మనీలో ఉద్యోగాలకు 55 మంది ఏపీ నర్సుల ఎంపిక..
- మారిషస్ స్టేట్ హౌస్‌లో డా.గజల్ శ్రీనివాస్ గానం
- తెలంగాణను దేశంలో అగ్రశ్రేణి పర్యాటక గమ్యస్థానంగా తీర్చిదిద్దుతాం: మంత్రి జూపల్లి
- ఆంధ్రప్రదేశ్ సంప్రదాయ హస్తకళలకు కొత్త ఊపిరి పోస్తున్న లేపాక్షి
- తెలంగాణ జైళ్ల శాఖకు అరుదైన గౌరవం.. 109వ స్కోచ్ అవార్డు







