అత్యవసరమైతే తప్ప ప్రయాణాలు వద్దు..
- December 19, 2021
సౌదీ అరేబియా: కోవిడ్-19 కొత్త వేరియంట్ ఒమిక్రాన్, కరోనా వైరస్ వ్యాప్తి నేపథ్యంలో సౌదీ ప్రజలు, ప్రవాసులు అత్యవసరమైతే తప్ప ప్రయాణాలకు దూరంగా ఉండాలని సౌదీ పబ్లిక్ హెల్త్ అథారిటీ సూచించింది. ముఖ్యంగా హై రిస్క్ దేశాలకు వెళ్లొద్దని తాజా ఉత్తర్వుల్లో పేర్కొంది. పలు దేశాల్లో ఒమిక్రాన్ వేరియంట్ కేసులు వేగంగా పెరగడంపై సౌదీ హెల్త్ మినిస్ట్రీ ఆందోళన వ్యక్తం చేసింది. సౌదీ అరేబియాలోకి వచ్చే వారు వ్యాక్సిన్ తో సంబంధం లేకుండా కనీసం ఐదు రోజుల పాటు సోషల్ క్వారంటైన్ లో ఉండాలని, వ్యాధి లక్షణాలు కన్పిస్తే యాంటీ PCR పరీక్షను చేయించుకోవాలని హెల్త్ అథారిటీ సూచించింది. మాస్క్ పెట్టుకోవటం, రద్దీ ప్రాంతాలు, బహిరంగ ప్రదేశాలకు దూరంగా ఉండాలని, శానిటైజ్ చేసుకోవటం పాటించాలని కోరింది. బూస్టర్ డోస్ కు అర్హులైన వారంతా తప్పకుండా వ్యాక్సిన్ చేయించుకోవాలని ప్రజలకు హెల్త్ అథారిటీ విజ్ఞప్తి చేసింది.
తాజా వార్తలు
- తెలంగాణకు జాతీయ రహదారుల ప్రాజెక్టులకు కేంద్రం గ్రీన్ సిగ్నల్
- టీ20 వరల్డ్ కప్ షెడ్యూల్ వచ్చేసింది..
- ఏపీలో మూడు కొత్త జిల్లాలు
- 5.17 మిలియన్లకు పెరిగిన కువైట్ జనాభా..!!
- హైలే గోబీ వోల్కానో విస్ఫోటనం.. సౌదీ అరేబియా సేఫేనా?
- ఫ్రెండ్లీ వాతావరణంలో నిర్మాణాత్మక సంస్కరణలు..!!
- డిసెంబర్లో పెట్రోల్ ధరలు తగ్గుతాయా?
- ఖతార్‌తో గోవా పర్యాటక సంబంధాలు..!!
- అరేబియా సముద్రం పై వొల్కానిక్ యాష్..ఒమన్ అలెర్ట్..!!
- WTITC గ్లోబల్ ట్రేడ్ & ఇన్వెస్ట్మెంట్ వింగ్ సెక్రటరీగా శ్రీకాంత్ బడిగ నియామకం







