దేశ రహస్యాల్ని బయటపెట్టిన కేసులో తుది వాదనల్ని విననున్న బహ్రెయిన్ కోర్టు

- December 21, 2021 , by Maagulf
దేశ రహస్యాల్ని బయటపెట్టిన కేసులో తుది వాదనల్ని విననున్న బహ్రెయిన్ కోర్టు

మనామా: దేశ రహస్యాల్ని బహిర్గతం చేసిన కేసులో ముగ్గురు వ్యక్తులపై విచారణ సందర్భంగా తుది వాదనల్ని బహ్రెయిన్ న్యాయస్థానం విననుంది.గురువారం ఈ కేసు విచారణ జరుగుతుంది. జాతీయ పెట్రోలియం సంస్థలో పని చేస్తోన్న ఓ వ్యక్తి, పెట్రోలియం సంస్థకు సేవలందిస్తున్న ఇంకో వ్యక్తి, అలాగే ఓ ప్రకటనల సంస్థలో పని చేస్తున్న ఆసియా జాతీయుడు.. ఈ ముగ్గురిపై విచారణ జరుగుతోంది. విదేశీ బ్యాంకు జారీ చేసిన డాక్యుమెంట్లను ఫోర్జరీ చేసి, 20 బిలియన్ డాలర్ల మేర టెండర్లను వేసేందుకు నిందితులు ప్రయత్నించారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com