మహిళల మార్కెట్ తిరిగి ప్రారంభం

- December 22, 2021 , by Maagulf
మహిళల మార్కెట్ తిరిగి ప్రారంభం

మస్కట్: కోవిడ్ 19 పాండమిక్ నేపథ్యంలో జలాన్ బని బుహాసన్ విమెన్స్ మార్కెట్ కొన్నాళ్ళపాటు మూతపడగా, అది తిరిగి ప్రారంభమయ్యింది. సౌత్ అల్ షర్కియా గవర్నరేటులోని ఈ మార్కెట్ తిరిగి ప్రారంభం కాగా, అన్ని కోవిడ్ నిబంధనలూ పాటించడం జరుగుతుందని నిర్వాహకులు తెలిపారు. ప్రతి శుక్రవారం జరిగే ఈ మార్కెట్‌లో ఎక్కువగా మహిళా విక్రయందారులే వుంటారు. మహిళలను ప్రోత్సహించే క్రమంలో ఈ మార్కెట్‌ని నిర్వహిస్తున్నట్లు విమెన్స్ మార్కెట్ హెడ్ నవాల్ బింట్ రషీద్ అల్ రజహ్యా చెప్పారు.

 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com