కువైట్లో పాస్పోర్ట్, వీసా సర్వీస్ కోసం BLS తో ఇండియన్ ఎంబసీ ఒప్పందం
- December 23, 2021
కువైట్: కువైట్లో పాస్పోర్ట్, వీసా సర్వీసుల కోసం BLS ఇంటర్నేషనల్ తో కువైట్లోని ఇండియన్ ఎంబసీ ఒప్పందం కుదిరింది. ఇరుపక్షాలు ఒప్పందంపై సంతకాలు చేశారు. ప్రస్తుతం భారతీయ పాస్పోర్ట్, వీసా సేవలను కువైట్లోని CKGS నిర్వహిస్తోంది. జనవరి 2022 నుంచి BLS ఇంటర్నేషనల్ పని మొదలుపెట్టనుంది. కువైట్లోని షార్క్, ఫహాహీల్, జ్లేబ్ అల్ షువైఖ్లలో మూడు కేంద్రాలతో కార్యకలాపాలు ప్రారంభించనుంది. పాస్పోర్ట్, వీసా ఫారమ్ ఫిల్లింగ్, ప్రింటింగ్, ఫోటోగ్రఫీ, ఫీ కలెక్ట్, అపాయింట్ మెంట్లు, హెల్ప్ లైన్లు వంటి సేవలను BLS అందించనుంది. కువైట్ లోని ఇండియన్ ఎంబసీకి ఏటా 2 లక్షల అప్లికేషన్లు వస్తాయి. BLS ఇంటర్నేషనల్.. కెనడా, యూఏఈ, రష్యా, సింగపూర్, చైనా, మలేషియా, ఒమన్, ఆస్ట్రియా, పోలాండ్, లిథువేనియా, నార్వే, హాంకాంగ్ వంటి దేశాల్లో దశాబ్ద కాలంగా భారతీయ ఎంబసీలకు సర్వీస్ అందిస్తున్న అనుభవం ఉంది.
తాజా వార్తలు
- బ్యాడ్మింటన్ కోర్టులో కుప్పకూలి భారత ప్రవాసి మృతి..!!
- ఫేక్ గ్లోబల్ విలేజ్ టికెట్ సైట్లపై దుబాయ్ పోలీసులు హెచ్చరిక..!!
- హారన్ విషయంలో రోడ్డు ఘర్షణ.. విద్యార్థికి జైలు శిక్ష..!!
- అల్టరౌటి చికెన్ ఫ్రాంక్ఫర్ట్ పై SFDA హెచ్చరిక..!!
- దుబాయ్ లో చంద్రబాబు గ్రీట్ అండ్ మీట్: డాక్టర్ రవి వేమూరు
- అల్ వక్రా రోడ్డు పాక్షికంగా మూసివేత..!!
- GCC జాయింట్ డిఫెన్స్ కౌన్సిల్ అత్యవసర సమావేశం..!!
- తాజా సంస్కరణలతో సామాన్యులకు భారీ ఊరట
- శ్రీవారి బ్రహ్మోత్సవాలకు భారీ భద్రతా ఏర్పాట్లు
- వడ్డీ రేట్లను 25 బేసిస్ పాయింట్లు తగ్గించిన QCB..!!