దుబాయ్ ఎక్స్ పో లో కరోనా కలకలం...జపాన్ పెవిలియన్‌లోని రెస్టారెంట్ సిబ్బందికి పాజిటివ్
- December 23, 2021
యూఏఈ: దుబాయ్ ఎక్స్ పో 2020 లో కరోనా కలకలం రేపింది. జపాన్ పెవిలియన్ కు చెందిన రెస్టారెంట్ లో ఓ వ్యక్తికి కరోనా పాజిటివ్ గా తేలింది. దీంతో వెంటనే రెస్టారెంట్ ను మూసివేశారు. అతనితో కాంటాక్ట్స్ అందరినీ ట్రేస్ చేస్తున్నారు. ఐతే రెస్టారెంట్ మాత్రమే తాత్కాలికంగా మూసివేస్తున్నట్లు...పెవిలియన్ మాత్రం కొనసాగుతుందని జపాన్ ఎంబసీ ప్రకటించింది. ఇటీవల మళ్లీ కరోనా కేసుల సంఖ్య భారీగా పెరుగుతోంది. దీంతో ముందస్తు చర్యల్లో భాగంగా ఎక్స్ పో లోని వర్క్ ఫోర్స్, ఇతర సిబ్బంది కి కరోనా టెస్టులు చేశారు. ఈ టెస్టుల్లో ఓ వ్యక్తి పాజిటివ్ గా తేలింది. దీంతో పరేడ్ లు, రోవింగ్ ఎంటర్ టైన్ కార్యకలాపాలను మూసివేస్తున్నట్లు నిర్వాహకులు తెలిపారు. అటు యూఏఈ కరోనా నివారణకు సమర్థవంతంగా చర్యలు చేపట్టింది. ప్రపంచంలో అత్యధిక టీకా రేటు కలిగిన దేశం యూఏఈ యే కావటం విశేషం. ఇప్పటికే ఇక్కడ 96 శాతం జనాభాకు టీకాలు ఇచ్చారు.
తాజా వార్తలు
- బ్యాడ్మింటన్ కోర్టులో కుప్పకూలి భారత ప్రవాసి మృతి..!!
- ఫేక్ గ్లోబల్ విలేజ్ టికెట్ సైట్లపై దుబాయ్ పోలీసులు హెచ్చరిక..!!
- హారన్ విషయంలో రోడ్డు ఘర్షణ.. విద్యార్థికి జైలు శిక్ష..!!
- అల్టరౌటి చికెన్ ఫ్రాంక్ఫర్ట్ పై SFDA హెచ్చరిక..!!
- దుబాయ్ లో చంద్రబాబు గ్రీట్ అండ్ మీట్: డాక్టర్ రవి వేమూరు
- అల్ వక్రా రోడ్డు పాక్షికంగా మూసివేత..!!
- GCC జాయింట్ డిఫెన్స్ కౌన్సిల్ అత్యవసర సమావేశం..!!
- తాజా సంస్కరణలతో సామాన్యులకు భారీ ఊరట
- శ్రీవారి బ్రహ్మోత్సవాలకు భారీ భద్రతా ఏర్పాట్లు
- వడ్డీ రేట్లను 25 బేసిస్ పాయింట్లు తగ్గించిన QCB..!!