నానోశాటిలైట్ ‘లైట్-1’ సక్సెస్.. ప్రధాని సల్మాన్ కు అభినందనల వెల్లువ
- December 23, 2021
బహ్రెయిన్: మొదటి బహ్రెయిన్-ఎమిరాటీ నానోశాటిలైట్ “లైట్-1” ప్రయోగం విజయవంతం అయినందుకు ప్రిన్స్, ప్రధాన మంత్రి సల్మాన్ బిన్ హమద్ అల్ ఖలీఫాకు అంతర్గత వ్యవహారాల మంత్రి, జనరల్ షేక్ రషీద్ బిన్ అబ్దుల్లా అల్ ఖలీఫా అభినందనలు తెలిపారు. ఈ మేరకు లేఖను పంపించారు. కింగ్ హమద్ బిన్ ఇసా అల్ ఖలీఫా దార్శనికతలకు, ప్రిన్స్ సల్మాన్ బిన్ హమద్ అల్ ఖలీఫా మద్దతుకు ధన్యవాదాలు తెలియజేశారు. చారిత్రాత్మక విజయాన్ని గర్వకారణంగా, జాతీయ సామర్థ్యాల అధునాతన స్థాయికి ప్రతిబింబంగా మంత్రి అభివర్ణించారు. జాతీయ భద్రతా సలహాదారు, రాయల్ గార్డ్ కమాండర్, సుప్రీం డిఫెన్స్ కౌన్సిల్ సెక్రటరీ జనరల్ షేక్ నాసర్ బిన్ హమద్ అల్ ఖలీఫా జాతీయ సాధనకు మద్దతు ఇవ్వడంలో కీలక పాత్ర పోషించారని అంతర్గత వ్యవహారాల మంత్రి తన లేఖలో ప్రశంసించారు.
తాజా వార్తలు
- హైదరాబాద్: గిన్నిస్ బుక్ లో తెలంగాణ ‘బతుకమ్మ’
- భారీ వర్షానికి చిగురుటాకులా వణికిన హైదరాబాద్..
- నటుడు రోబో శంకర్ మృతి..
- బ్యాడ్మింటన్ కోర్టులో కుప్పకూలి భారత ప్రవాసి మృతి..!!
- ఫేక్ గ్లోబల్ విలేజ్ టికెట్ సైట్లపై దుబాయ్ పోలీసులు హెచ్చరిక..!!
- హారన్ విషయంలో రోడ్డు ఘర్షణ.. విద్యార్థికి జైలు శిక్ష..!!
- అల్టరౌటి చికెన్ ఫ్రాంక్ఫర్ట్ పై SFDA హెచ్చరిక..!!
- దుబాయ్ లో చంద్రబాబు గ్రీట్ అండ్ మీట్: డాక్టర్ రవి వేమూరు
- అల్ వక్రా రోడ్డు పాక్షికంగా మూసివేత..!!
- GCC జాయింట్ డిఫెన్స్ కౌన్సిల్ అత్యవసర సమావేశం..!!