ఫైజర్ కోవిడ్ టాబ్లెట్ కు అమెరికా ఆమోదం

- December 23, 2021 , by Maagulf
ఫైజర్ కోవిడ్ టాబ్లెట్ కు అమెరికా ఆమోదం

కరోనా కట్టడికి ఫార్మా దిగ్గజం ఫైజర్ సంస్థ తయారుచేసిన టాబ్లెట్ 'పాక్స్‌లోవిడ్'కు అమెరికా ఫుడ్ అండ్ డ్రగ్ అడ్మినిస్ట్రేషన్ బుధవారం అత్యవసర అనుమతులు మంజూరు చేసింది.

దీంతో కొవిడ్ చికిత్సకు ఇంట్లోనే ఈ ఔషధాన్ని తీసుకోవచ్చని కంపెనీ ప్రతినిధులు తెలిపారు. ఈ టాబ్లెట్ తీసుకోవడం వల్ల ఆస్పత్రిలో చేరే ప్రమాదాన్ని88 శాతం తగ్గించడంతో పాటు తీవ్రమైన వ్యాధికి గురైన వారిలో మరణాలను నివారించవచ్చునని అధ్యయనంలో తేలింది. అమెరికా ప్రభుత్వ అనుమతి పొందిన తొలి కరోనా టాబ్లెట్ ఇదే కావడం విశేషం.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com