ప్రత్యేక ప్రవేశ దర్శనం టికెట్లు విడుదల చేయనున్న టిటిడి..
- December 23, 2021
తిరుమల: తిరుమల శ్రీ వేంకటేశ్వరుని ఎన్ని సార్లు దర్శించుకున్నా తనివి తీరదు భక్తులకు. ఏడుకొండలపై కొలువై ఉన్న ఆ వెంకన్న స్వామిని ఏటా కొన్ని లక్షల మంది భక్తులు సందర్శిస్తుంటారు. తాజాగా భక్తుల సౌకర్యార్ధం టిటిడి దేవస్థాన అధికారులు 2022, జనవరి నెలకు సంబంధించి రోజుకు 20,000 చొప్పున 6.20 లక్షల టికెట్లు విడుదల చేస్తామని తెలిపింది.
ఈనెల డిసెంబరు 24 ఉదయం 9 గంటలకు రూ.300 ప్రత్యేక దర్శనం టికెట్లు విడుదల చేయనున్నట్లు టిటిడి ప్రకటించింది. ఇక డిసెంబర్ 31 నుంచి తిరుపతిలో ఆఫ్‌లైన్‌లో సర్వదర్శనం టికెట్లు ఇస్తామని తెలిపింది. జనవరి నెలకు సంబంధించి రోజుకు 5వేల చొప్పున మొత్తం 1.55 లక్షల సర్వదర్శనం టికెట్లు ఇస్తామని దేవస్థాన అధికారులు పేర్కొన్నారు.
దర్శనం కోసం భక్తులు తిరుమల తిరుపతి దేవస్థానం యొక్క అధికారిక వెబ్సైట్ నుండి రూ. 300 టిక్కెట్‌ను కొనుగోలు చేయవచ్చు http://www.tirupatibalaji.ap.gov.in.
తాజా వార్తలు
- సౌదీలో కొత్త పండ్లు, కూరగాయల ప్యాకేజింగ్ నిబంధనలు..!!
- వెబ్ సమ్మిట్ ఖతార్ 2026కి విస్తృత ఏర్పాట్లు..!!
- దుబాయ్ మిరాకిల్ గార్డెన్ సీజన్ 14 వచ్చేసింది..!!
- వరల్డ్ టాప్ 10 సురక్షితమైన దేశాలలో ఒమన్..!!
- కువైట్ లో "దిస్ ఈస్ యువర్ రోల్" ప్రారంభం..!!
- బహ్రెయిన్, ఇండియా మధ్య లీగల్, ట్యాక్స్ సహకారం..!!
- ఒమన్‌తో మ్యాచ్..టీమ్ఇండియాకు ఎంతో ప్రత్యేకం..
- హైదరాబాద్: గిన్నిస్ బుక్ లో తెలంగాణ ‘బతుకమ్మ’
- భారీ వర్షానికి చిగురుటాకులా వణికిన హైదరాబాద్..
- నటుడు రోబో శంకర్ మృతి..