మాజీ ప్రధాని పీవీ నరసింహారావుకు ప్రముఖుల నివాళులు
- December 23, 2021
హైదరాబాద్: ఇవాళ మాజీ ప్రధాని పీవీ నరసింహారావు 17వ వర్ధంతి. ఈ సందర్భంగా పీవీ నరసింహారావుకు ప్రముఖులు నివాళులర్పించారు. నగరంలోని నెక్లెస్ రోడ్డులో పీవీ జ్ఞానభూమి వద్ద గవర్నర్ తమిళిసై సౌందర్ రాజన్, అలాగే పీవీ సమాధి వద్ద మంత్రులు తలసాని శ్రీనివాస్ యాదవ్, మహముద్ అలీ, శ్రీనివాస్ గౌడ్, ఎమ్మెల్యే ముఠా గోపాల్, టీఆర్ఎస్ ఎమ్మెల్సీ సురభి వాణీదేవీతో పాటు పీవీ కుటుంబ సభ్యులు, పలువురు నాయకులు నివాళులర్పించారు. ఈసందర్భంగా ఎమ్మెల్సీ సురభి వాణీదేవి మాట్లాడుతూ… తెలంగాణ ప్రభుత్వం పీవీ నరసింహారావు శత జయంతి ఉత్సవాలను ఘనంగా నిర్వహించిందన్నారు. దేశంలో పీవీ ఎన్నో సంస్కరణలు చేశారని గుర్తు చేశారు. పీవీ దేశానికి అందించిన సేవలను ప్రజలు ఎప్పటికీ మరిచిపోరని చెప్పారు. మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ మాట్లాడుతూ… పీవీ నరసింహారావు దేశంలో ఎన్నో సంస్కరణలు తీసుకొచ్చారని గుర్తు చేశారు. దేశం గర్వించదగ్గ వ్యక్తి పీవీ నరసింహారావు అని, కానీ కేంద్రం తెలుగువారిని పట్టించుకోవడం లేదన్నారు. తెలుగువారంటే కేంద్రంలో గౌరవం లేదని మంత్రి తలసాని తెలిపారు.
తాజా వార్తలు
- యూఏఈ లాటరీ ‘లక్కీ డే’ డ్రా: ముగ్గురికి అదృష్టం..
- ఆంధ్రప్రదేశ్లో 400 మెగావాట్ల సోలార్ ప్రాజెక్ట్
- చెన్నైలో పార్లమెంటరీ కమిటీ సమావేశంలో ఎంపీ బాలశౌరి
- అల్ ఐన్లో విషాదం: వాటర్ కూలర్ నుంచి విద్యుత్ షాక్తో 8 ఏళ్ల బాలుడి మృతి
- మస్కట్లో నివాస ప్రాంతాల్లో భారీ వాహనాలతో పాదచారులకు ముప్పు
- దుబాయ్లో ప్రవక్త మహమ్మద్ (PBUH) జన్మదిన సెలవు సందర్భంగా ఉచిత పార్కింగ్
- జనవరి 1 నుంచి రాష్ట్ర వ్యాప్తంగా ‘సంజీవని’: సీఎం చంద్రబాబు
- నేపాల్లో వరదలు.. 95కు చేరిన మృతుల సంఖ్య
- అమెరికాలో ఘోర ప్రమాదం.. ముగ్గురు తెలంగాణ యువకులు మృతి
- మానవాళికి AIతో భారీ ముప్పు: బిల్ గేట్స్







