నిమ్మకాయల్లో డ్రగ్స్ స్మగ్లింగ్ ప్రయత్నం . పట్టుకున్న పోలీసులు
- December 24, 2021
యూఏఈ: నకిలీ నిమ్మకాయల్లో దాచిన 58 మిలియన్ దిర్హాంల డ్రగ్స్ ను దుబాయ్ పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. 1,160,500 క్యాప్టాగన్ ట్యాబెట్లను అక్రమంగా తరలిస్తున్న నలుగురు వ్యక్తులను అరెస్టు చేశారు. వీటి విలువ 58 మిలియన్ దిర్హామ్‌లు ఉంటుందని అధికారులు తెలిపారు. "66"గా పిలువబడే ఈ ప్రోయాక్టివ్ ఆపరేషన్‌ను జనరల్ డిపార్ట్మెంట్ ఆఫ్ యాంటీ నార్కోటిక్స్ నిర్వహించింది. నిందితులు నిమ్మకాయల పెట్టెలు, ప్లాస్టిక్ డ్రగ్ కంటైనర్లలో నకిలీ నిమ్మకాయలను ఉంచారు. అందులో డ్రగ్స్ ను తరలించే ప్రయత్నం చేస్తున్నట్లు సమాచారం అందటంతో తనిఖీలు చేసి డ్రగ్స్ స్వాధీనం చేసుకున్నట్లు దుబాయ్ పోలీసులు తెలిపారు.
తాజా వార్తలు
- మోడీ కి ఘనంగా విషెస్ తెలిపిన బుర్జ్ ఖలీఫా
- సామాన్యుడి సైతం అందుబాటులో విమాన ప్రయాణం: కేంద్ర మంత్రి రామ్మోహన్
- సౌదీ అరేబియాలో నాలుగేళ్లలో వచ్చే బ్యాంకు సెలవులు..!!
- డ్యూటీ ఫ్రీ డ్రా.. $1 మిలియన్ గెలుచుకున్న కేరళ వాసి..!!
- యూనివర్శిటీ స్ట్రీట్‌లో రోడ్డు మూసివేత: అష్ఘల్
- కువైట్ లో భారత రాయబారి పనితీరుపై ప్రశంసలు..!!
- AI లో ఇండియా-బహ్రెయిన్ మధ్య సహకారం..!!
- మాదకద్రవ్యాల వాడకాన్ని తగ్గించేందుకు 'హయా' ప్లాట్‌ఫామ్..!!
- టెర్మినల్–1 ఫ్లైట్ రెస్టారెంట్–విమానం ఎక్కిన ఫీలింగ్‌తో భోజనం
- బ్రహ్మోత్సవాల్లో ఇస్రో సేవలు తొలిసారి శాటిలైట్ ఆధారంగా భక్తుల గణన: బిఆర్ నాయుడు