క్రిస్మస్.. మొదటి అరబిక్ మాస్ నిర్వహణకు కొత్త కేథడ్రల్ సిద్ధం
- December 24, 2021
బహ్రెయిన్: క్రిస్మస్ పర్వదినం సందర్భంగా మొదటి అరబిక్ మాస్ నిర్వహణకు కొత్త కేథడ్రల్ సిద్ధమైంది. ఈ విషయాన్ని మనామాలోని సేక్రేడ్ హార్ట్ చర్చ్ ఫాదర్ ఫయాద్ చార్బెల్ తెలిపారు. ఆరోగ్య మంత్రిత్వ శాఖ అమలు చేస్తున్న COVID-19 ప్రోటోకాల్‌లకు కచ్చితంగా కట్టుబడి మాస్ నిర్వహించబడుతుందని ఫాదర్ చార్బెల్ చెప్పారు. డిసెంబరు 9న అవలీలో కింగ్ హమద్ బిన్ ఇసా అల్ ఖలీఫా ఆధ్వర్యంలో అత్యాధునికమైన కేథడ్రల్ ఆఫ్ అవర్ లేడీ ఆఫ్ అరేబియాను ప్రారంభించిన విషయం తెలిసిందే. అష్టభుజి గోపురం, రెండు ప్రార్థనా మందిరాలు కలిగిన ఈ ఆధునిక చర్చిలో ఒకేసారి 800 మంది ప్రార్థన చేసేందుకు వీలుగా ఆడిటోరియం ఉంది. బహ్రెయిన్‌లోని 80,000 మంది కాథలిక్‌లకు ఇది ప్రధాన చర్చ్.
తాజా వార్తలు
- ఈ నెల 30 వరకు ఏపీ అసెంబ్లీ
- రాహుల్ గాంధీ మరో బాంబు..మీడియా ముందుకు ‘సాక్ష్యాలు’..
- మోడీ కి ఘనంగా విషెస్ తెలిపిన బుర్జ్ ఖలీఫా
- సామాన్యుడి సైతం అందుబాటులో విమాన ప్రయాణం: కేంద్ర మంత్రి రామ్మోహన్
- సౌదీ అరేబియాలో నాలుగేళ్లలో వచ్చే బ్యాంకు సెలవులు..!!
- డ్యూటీ ఫ్రీ డ్రా.. $1 మిలియన్ గెలుచుకున్న కేరళ వాసి..!!
- యూనివర్శిటీ స్ట్రీట్‌లో రోడ్డు మూసివేత: అష్ఘల్
- కువైట్ లో భారత రాయబారి పనితీరుపై ప్రశంసలు..!!
- AI లో ఇండియా-బహ్రెయిన్ మధ్య సహకారం..!!
- మాదకద్రవ్యాల వాడకాన్ని తగ్గించేందుకు 'హయా' ప్లాట్‌ఫామ్..!!