భారత్ లో ఒక్కరోజే 100కు పైగా ఒమిక్రాన్ కేసులు..కరోనా మూడో వేవ్ వచేసినట్టేనా?

- December 24, 2021 , by Maagulf
భారత్ లో ఒక్కరోజే 100కు పైగా ఒమిక్రాన్ కేసులు..కరోనా మూడో వేవ్ వచేసినట్టేనా?

భారత్ లో కరోనా కొత్త వేరియంట్ ఒమిక్రాన్ వేగంగా విస్తరిస్తోంది. నిన్న ఉదయానికి 236గా ఉన్న ఒమిక్రాన్ బాధితుల సంఖ్య.. తాజాగా 358కి చేరింది. ఒక్క రోజు వ్యవధిలోనే 100 మందికి పైగా ఈ వేరియంట్ బారినపడ్డారు. ఈ మేరకు శుక్రవారం కేంద్ర ఆరోగ్య శాఖ గణాంకాలను వెల్లడించింది. ఇప్పటి వరకూ మహారాష్ట్రలో అత్యధికంగా 88 మందికి ఒమిక్రాన్ సోకగా.. ఢిల్లీ తర్వాతి స్థానంలో ఉంది. అక్కడ బాధితుల సంఖ్య 67కి చేరింది. మొత్తంగా 114 మంది కోలుకొని, ఇళ్లకు చేరుకున్నారు.

అలాగే నిన్న 11లక్షల మందికి పైగా కరోనా నిర్ధారణ పరీక్షలు చేయించుకోగా..6,650 మందికి పాజిటివ్‌గా నిర్ధారణ అయింది. రోనా నుంచి మ‌రో 7,051 మంది కోలుకున్నట్లు కేంద్ర వైద్యారోగ్య శాఖ వెల్ల‌డించింది. ప్ర‌స్తుతం 77,516 కేసులు యాక్టివ్‌గా ఉన్న‌ట్లు తెలిపింది. మ‌ర‌ణాల సంఖ్య 4,79,133కు చేరింది. ఇప్ప‌టి వ‌ర‌కు 1,40,31,63,063 మంది కొవిడ్ టీకా తీసుకున్నారు. 24 గంటల వ్యవధిలో 374 మంది ప్రాణాలు కోల్పోయారు. మొత్తం మృతుల సంఖ్య 4.79లక్షలకు చేరింది. 

ఇక నిన్న 57 లక్షల మందికి పైగా టీకాలు వేయించుకున్నారు. నిన్న సాయంత్రం వరకు పంపిణీ అయిన డోసుల సంఖ్య 140 కోట్ల మార్కును దాటినట్లు కేంద్రం వెల్లడించింది.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com