నౌకలో అగ్నిప్రమాదం.. 32 మంది సజీవదహనం
- December 24, 2021
ఢాకా: బంగ్లాదేశ్లో ఘోర ప్రమాదం జరిగింది. ఓ నౌకలో మంటలు చెలరేగి 32 మంది ప్రయాణికులు ప్రాణాలు కోల్పోయారు. ఝలోకఠి ప్రాంతంలోని సుగంధ నదిపై ఈ దుర్ఘటన చోటుచేసుకుంది.
పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం..
బంగ్లాదేశ్ రాజధాని ఢాకా నుంచి బరుంగా వెళ్తున్న ఓ మూడంతస్తుల ప్రయాణికుల నౌకలో శుక్రవారం తెల్లవారుజామున 3.30 గంటల ప్రాంతంలో అగ్నిప్రమాదం జరిగింది. పడవలో ఒక్కసారిగా మంటలు వ్యాపించడంతో ప్రయాణికులు భయభ్రాంతులకు గురయ్యారు. ప్రాణాలు కాపాడుకునేందుకు కొందరు నదిలోకి దూకారు. మంటల్లో చిక్కుకుని 32 మంది సజీవదహనమైనట్లు అధికారులు తెలిపారు. మరికొందరు గాయపడగా.. చికిత్స నిమిత్తం ఆసుపత్రికి తరలించారు. మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశముందని అధికారులు తెలిపారు. ఘటనపై మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.
తాజా వార్తలు
- ఈ నెల 30 వరకు ఏపీ అసెంబ్లీ
- రాహుల్ గాంధీ మరో బాంబు..మీడియా ముందుకు ‘సాక్ష్యాలు’..
- మోడీ కి ఘనంగా విషెస్ తెలిపిన బుర్జ్ ఖలీఫా
- సామాన్యుడి సైతం అందుబాటులో విమాన ప్రయాణం: కేంద్ర మంత్రి రామ్మోహన్
- సౌదీ అరేబియాలో నాలుగేళ్లలో వచ్చే బ్యాంకు సెలవులు..!!
- డ్యూటీ ఫ్రీ డ్రా.. $1 మిలియన్ గెలుచుకున్న కేరళ వాసి..!!
- యూనివర్శిటీ స్ట్రీట్లో రోడ్డు మూసివేత: అష్ఘల్
- కువైట్ లో భారత రాయబారి పనితీరుపై ప్రశంసలు..!!
- AI లో ఇండియా-బహ్రెయిన్ మధ్య సహకారం..!!
- మాదకద్రవ్యాల వాడకాన్ని తగ్గించేందుకు 'హయా' ప్లాట్ఫామ్..!!