అబుధాబి: 2,794 మంది కార్మికులకు బకాయిలు చెల్లించాలని కోర్టు ఆదేశం
- December 26, 2021
అబుధాబి: 4 కంపెనీల్లోని 2,794 మంది కార్మికులకు 40 మిలియన్ దిర్హాలు బకాయిల చెల్లింపును అబుధాబి లేబర్ కోర్టు క్లియర్ చేసింది. క్లెయిమ్‌ల నమోదును సులభతరం చేయడంతోపాటు కేసుల విచారణకు అబుధాబి న్యాయ శాఖ (ADJD) మొబైల్ లేబర్ కోర్టును ఏర్పాటు చేసింది. విచారణలో భాగంగా కార్మికులు ఉండే చోటుకు వెళ్లి వారి హక్కులను కాపాడటంతోపాటు వారికి సత్వరం న్యాయం జరిగేలా చర్యలు తీసుకుంటుంది. రికార్డు సమయంలో కార్మికుల సమస్యలను పరిష్కరించేందుకు స్పష్టమైన యంత్రాంగాన్ని అవలంబించామని అబుధాబి లేబర్ కోర్టు స్పష్టం చేసింది. ఈ సందర్భంగా ఉప ప్రధాన మంత్రి, అధ్యక్ష వ్యవహారాల మంత్రి, అబుధాబి న్యాయ శాఖ ఛైర్మన్ మన్సూర్ బిన్ జాయెద్ అల్ నహ్యాన్ మాట్లాడుతూ.. న్యాయ వ్యవస్థపై కార్మికుల్లో విశ్వాసాన్ని బలపరిచే విధంగా లేబర్ కోర్టు తీర్పునిచ్చిందన్నారు.
తాజా వార్తలు
- వడ్డీ రేట్లను 25 బేసిస్ పాయింట్లు తగ్గించిన QCB..!!
- ఫోర్బ్స్ మిడిల్ ఈస్ట్ సస్టైనబిలిటీ లీడర్లలో నలుగురు కువైటీలు..!!
- పర్వతారోహణ సాధన చేస్తూ గాయపడ్డ వ్యక్తి..!!
- తవక్కల్నా యాప్ కొత్త ఇంటర్ఫేస్ ఆవిష్కరణ..!!
- ఇసా టౌన్ ప్రసిద్ధ మార్కెట్లో తనిఖీలు..!!
- రాస్ అల్ ఖైమాలో గ్యాస్ సిలిండర్ పేలుడు..!!
- ఈ నెల 30 వరకు ఏపీ అసెంబ్లీ
- రాహుల్ గాంధీ మరో బాంబు..మీడియా ముందుకు ‘సాక్ష్యాలు’..
- మోడీ కి ఘనంగా విషెస్ తెలిపిన బుర్జ్ ఖలీఫా
- సామాన్యుడి సైతం అందుబాటులో విమాన ప్రయాణం: కేంద్ర మంత్రి రామ్మోహన్