కర్ణాటకలో నైట్ కర్ఫ్యూ..
- December 26, 2021
బెంగుళూరు: దక్షిణాఫ్రికాలో వెలుగు చూసిన కరోనా కొత్త వేరియంట్ ఒమిక్రాన్ ఇండియాలో కూడా వ్యాప్తి చెందుతోంది. ఇప్పటికే పలు రాష్ట్రాల్లో ఒమిక్రాన్ కేసులు నమోదవుతున్నాయి.కరోనా ఫస్ట్ వేవ్, సెకండ్ వేవ్‌లతో ప్రజలు, ప్రభుత్వాలు ఆర్థికంగా చాలా నష్టపోయాయి.అయితే ఇప్పుడు ఒమిక్రాన్ వ్యాప్తి నేపథ్యంలో మరోసారి లాక్‌డౌన్ విధిస్తే ఆర్థిక రాష్ట్రాల్లో కురుకుపోయే ప్రమాదం లేకపోలేదు.
ఇటు చూస్తే ఒమిక్రాన్ వేరియంట్ డెల్టా కంటే 6 రెట్లు వేగంగా వ్యాప్తి చెందుతుండడంతో కర్ణాటకలో నైట్ కర్ఫ్యూ విధిస్తున్నట్లు ఆ ప్రభుత్వం ప్రకటించింది. అయితే ఈ నెల 28 నుంచి నైట్ కర్ఫ్యూ విధిస్తున్నట్లు అధికారులు వెల్లడించారు. కర్ణాటకలో రాత్రి 10 నుంచి ఉదయం 5 గంటల వరకు నైట్ కర్ఫ్యూ విధిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. ఒమిక్రాన్‌పై ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, తగిన జాగ్రత్తలు తీసుకోవాలని ప్రభుత్వం సూచించింది. సామూహిక కార్యక్రమాలపై ఆంక్షలు కూడా ఉంటాయని అధికారులు పేర్కొన్నారు.
తాజా వార్తలు
- ఘనంగా GTWCA 19వ బతుకమ్మ సంబరాలు..
- దుబాయ్‌లో మిడిల్ ఈస్ట్ లోని అతిపెద్ద జ్యువెలరీ డెస్టినేషన్ ప్రారంభం
- దుబాయ్ మెట్రో నుంచి ఎతిహాద్ రైల్ స్టేషన్‌కు నడక మార్గం.. కొత్త పాదచారుల బ్రిడ్జి ప్రారంభం
- సౌదీ రక్షణ మంత్రితో షేక్ మన్సూర్ బిన్ జాయెద్ భేటీ
- ఇరాన్ అణు సామర్థ్యం పై ట్రంప్ వ్యాఖ్యలు
- బహ్రెయిన్‌లో అద్దెదారులకు ఊరట..?
- ఒమన్‌లో ప్రవాస మహిళలు అరెస్ట్..!!
- సౌదీలో నాలుగు ప్రాంతాలకు రెడ్ అలెర్ట్ జారీ..!!
- ప్రాంతీయ భద్రతను మరింత బలోపేతం చేయాలి..!!
- అబుదాబిలో 9,237 ఈ-స్కూటర్లు సీజ్..!!







