జనవరిలో బ్యాంకులకు సెలవులు..
- December 27, 2021
ముంబై: ఈ ఏడాది ముగిసి 2022 సంవత్సరంలోకి అడుగు పెట్టుబోతున్నాము. ఇక ప్రతి రోజు ఎంతో మంది బ్యాంకు ఖాతాలకు సంబంధించి లావాదేవీలు జరుపుతుంటారు. ప్రతి రోజు ఎంతో మంది బ్యాంకు పనుల నిమిత్తం ఆయా బ్రాంచ్‌లకు వెళ్తూ తమతమ లావాదేవీలకు సంబంధించిన పనులను చేసుకుంటారు. ఇక 2022 జనవరి నెలలో బ్యాంకుల పని దినాలు తగ్గిపోనున్నాయి. రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (RBI) మార్గదర్శకాల ప్రకారం.. పలు రాష్ట్రాల్లో సెలవుల కారణంగా జనవరి నెల మొత్తంలో 16 రోజులు మాత్రమే బ్యాంకులు పని చేయనున్నాయి.
ప్రభుత్వ, ప్రైవేటు బ్యాంకులు సైతం సెలవులు ప్రకటించాయి. సాధారణంగా రాష్ట్ర ప్రభుత్వ సెలవులు మినహా, దేశ వ్యాప్తంగా బ్యాంకు సెలవులు ఒకే విధంగా ఉంటాయి. రెండో శనివారం, నాలుగో శనివారం, ఇతర జాతీయ పండుగల సందర్భంగా బ్యాంకులకు సెలవులు ఉంటాయి. ఇవేకాకుండా ఆర్బీఐ మార్గదర్శకాల ప్రకారం.. మరికొన్ని బ్యాంకు సెలవులు ఉంటాయి. మరి 2022 ఏడాదిలో జనవరి నెలలో బ్యాంకుల సెలవులను తెలుసుకుందాం.
2022 జనవరిలో బ్యాంకులకు సెలవులు:
జనవరి 1న కొత్త సంవత్సరం తర్వాత ఆదివారం
జనవరి 4: లోసూంగ్ (సిక్కిం), ఇది జాతీయ సెలవు కాదు
జనవరి 8: రెండో శనివారం
జనవరి 11: మిషనరీ డే (మిజోరం) ఇది జాతీయ సెలవు కాదు
జనవరి 12: స్వామి వివేకానంద పుట్టినరోజు
జనవరి 14: మకర సంక్రాంతి/పొంగల్
జనవరి 15: సంక్రాంతి, పొంగల్, తిరువళ్లువర్ దినోత్సవం సందర్భంగా బెంగళూరు, చెన్నై, గ్యాంగ్‌టక్, హైదరాబాద్‌లలో బ్యాంకులు మూతపడనున్నాయి
జనవరి 18: తాయ్ పూసం (చెన్నై)
జనవరి 22: నాలుగో శనివారం
జనవరి 26: గణతంత్ర దినోత్సవం
జనవరి 31, 2022: మీ-డ్యామ్-మీ-ఫై (అస్సాం) జాతీయ సెలవు కాదు
అయితే జనవరి 2, 9, 16,23,30 వ తేదీల్లో ఆదివారం. కాబట్టి ఆ రోజు బ్యాంకులు యధావిధిగా మూసి ఉంటాయి.
తాజా వార్తలు
- యూనివర్శిటీ స్ట్రీట్‌లో రోడ్డు మూసివేత: అష్ఘల్
- కువైట్ లో భారత రాయబారి పనితీరుపై ప్రశంసలు..!!
- AI లో ఇండియా-బహ్రెయిన్ మధ్య సహకారం..!!
- మాదకద్రవ్యాల వాడకాన్ని తగ్గించేందుకు 'హయా' ప్లాట్‌ఫామ్..!!
- టెర్మినల్–1 ఫ్లైట్ రెస్టారెంట్–విమానం ఎక్కిన ఫీలింగ్‌తో భోజనం
- బ్రహ్మోత్సవాల్లో ఇస్రో సేవలు తొలిసారి శాటిలైట్ ఆధారంగా భక్తుల గణన: బిఆర్ నాయుడు
- పాకిస్తాన్ సంచలన నిర్ణయం..
- జెనీవాలో దోహాపై ఇజ్రాయెల్ దాడిని ఖండించిన 78 దేశాలు..!!
- బహ్రెయిన్ లో కుటుంబ వ్యవస్థ బలోపేతం..!!
- బహ్రెయిన్, కువైట్ నుంచి క్యారీఫోర్ ఔట్.. త్వరలో యూఏఈ?