భారత్‌లో విజృంభిస్తున్న ఒమిక్రాన్..
- December 28, 2021
న్యూ ఢిల్లీ: భారత్‌లో కరోనా కొత్తవేరియంట్ ఒమిక్రాన్ పంజా విసురుతోంది.శరవేగంగా వ్యాప్తి చెందుతోంది.నిన్న ఒక్క రోజే 75 కేసులు నమోదు అయ్యాయి.మంగళవారం ఉదయం నాటికి దేశ వ్యాప్తంగా ఒమిక్రాన్ కేసుల సంఖ్య 653కు చేరిందని కేంద్ర ఆరోగ్యశాఖ వెల్లడించింది. మహారాష్ట్రలో 167, ఢిల్లీలో 165, కేరళలో 57, తెలంగాణలో 55, గుజరాత్‌లో 49, రాజస్థాన్‌లో 46, తమిళనాడులో 34, కర్ణాటకలో 31, మధ్యప్రదేశ్‌లో 9, బడిశాలో 8, ఆంధ్రప్రదేశ్‌లో 6, పశ్చిమ బెంగాల్ 6, హర్యానాలో 4, ఉత్తరాఖండ్‌లో 4, చండీఘర్‌లో 3, జమ్ము కశ్మీర్‌లో 3, ఉత్తరప్రదేశ్‌లో 2, గోవా 1, లద్దాఖ్‌లో 1, హిమాచల్ ప్రదేశ్‌లో 1, మణిపూర్‌లో 1 చొప్పున కేసులు నమోదు అయ్యాయి. మొత్తం కేసుల్లో ఇప్పటి వరకు 186 మంది కోలుకున్నారు.
ఇక గడిచిన 24 గంటల్లో దేశ వ్యాప్తంగా 10,35,495 కరోనా శాంపిళ్లను పరీక్షించగా.. 6,358 పాజిటివ్ కేసులు నమోదు అయ్యాయి.దీంతో దేశంలో మొత్తం కేసుల సంఖ్య 3,47,99,691కి చేరింది. నిన్న ఒక్క రోజే 293 మంది ప్రాణాలు కోల్పోయారు.దేశంలో కరోనా మహమ్మారి వ్యాప్తి మొదలైనప్పటి నుంచి ఇప్పటి వరకు మరణించిన వారి సంఖ్య 4,80,290కి చేరింది. నిన్న 6,450 మంది కోలుకున్నారు. ఇప్పటి వరకు వైరస్‌ను జయించిన వారి సంఖ్య 3,42,43,945కి చేరింది. ప్రస్తుతం దేశంలో 75,456 యాక్టివ్ కేసులు ఉన్నాయి. జాతీయ రికవరీ రేటు 98.40 శాతంగా ఉంది. ఇక దేశంలో జనవరి 16న ప్రారంభమైన వ్యాక్సినేషన్ కార్యక్రమం శరవేగంగా కొనసాగుతోంది. నిన్న72,87,547 మందికి టీకాలు వేశారు.ఇప్పటి వరకు 142.47 కోట్లకు పైగా డోసుల వ్యాక్సిన్‌ను పంపిణీ చేశారు.ఇక ఇప్పటి వరకు దేశంలో 67.41 కోట్ల మందికి కరోనా పరీక్షలు చేశారు.
తాజా వార్తలు
- టెర్మినల్–1 ఫ్లైట్ రెస్టారెంట్–విమానం ఎక్కిన ఫీలింగ్‌తో భోజనం
- బ్రహ్మోత్సవాల్లో ఇస్రో సేవలు తొలిసారి శాటిలైట్ ఆధారంగా భక్తుల గణన: బిఆర్ నాయుడు
- పాకిస్తాన్ సంచలన నిర్ణయం..
- జెనీవాలో దోహాపై ఇజ్రాయెల్ దాడిని ఖండించిన 78 దేశాలు..!!
- బహ్రెయిన్ లో కుటుంబ వ్యవస్థ బలోపేతం..!!
- బహ్రెయిన్, కువైట్ నుంచి క్యారీఫోర్ ఔట్.. త్వరలో యూఏఈ?
- రిమైండర్..ఎయిర్ పోర్టుల్లో క్యాష్, గోల్డ్ వెల్లడిపై రూల్స్..!!
- గాజాలో ఇజ్రాయెల్ నేరాలపై UN నివేదికను స్వాగతించిన సౌదీ అరేబియా..!!
- రికార్డులతో ఖరీఫ్ సీజన్‌ను ముగించిన ఒమన్ ఎయిర్..!!
- క్రీడల ద్వారా ఏపీ పర్యాటకానికి ప్రచారం: ఏపీటీడీసీ ఎండీ ఆమ్రపాలి