సినోఫార్మ్ కొత్త కోవిడ్ వ్యాక్సిన్ కు ఆమోదం

- December 28, 2021 , by Maagulf
సినోఫార్మ్ కొత్త కోవిడ్ వ్యాక్సిన్ కు ఆమోదం

యూఏఈ: సినోఫార్మ్ CNBG కొత్త రీకాంబినెంట్ ప్రోటీన్ వ్యాక్సిన్ అత్యవసర వినియోగాన్ని యూఏఈ ఆమోదించింది. దేశంలో నిర్వహించిన ఒక అధ్యయన డేటా ఆధారంగా ఈ నిర్ణయం తీసుకున్నట్లు యూఏఈ ప్రకటించింది. గతంలో సినోఫార్మ్ CNBG వ్యాక్సిన్ రెండు డోసులు టీకాలు తీసుకున్న వారు కూడా ఈ అధ్యయనంలో ఉన్నారు. న్యూట్రలైజింగ్ యాంటీబాడీలను ఉత్పత్తి చేయడంలో సెరోకన్వర్షన్ రేటు (సమర్థత) 100 శాతం వరకు ఉంది. ఈ అధ్యయనంలో పాల్గొన్నవారిలో ఎవరిలోనూ దుష్ప్రభావాలు కన్పించలేదు. SARS-CoV-2 వేరియంట్‌లకు వ్యతిరేకంగా ఈ వ్యాక్సిన్ మెరుగైన యాంటీబాడీలను ఉత్పత్తి చేసిందని యూఏఈ వెల్లడించింది.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com