అబుధాబిలో తొలి ముస్లిమేతర జంటకు మ్యారేజ్ సర్టిఫికేట్ జారీ
- December 28, 2021
అబుధాబి: అబుధాబిలో ముస్లిమేతర జంటకు కోర్టు తొలిసారిగా మ్యారేజ్ సర్టిఫికేట్ జారీ చేసింది. కెనడియన్ పౌరసత్వం ఉన్న జంటకు మొదటి సివిల్ మ్యారేజ్ కాంటాక్ట్ జారీ చేసింది. డిసెంబరు 14న కొత్త కోర్టును ప్రారంభించిన తర్వాత అరబ్ ప్రాంతంలో ఈ తరహా జారీ చేయడం ఇదే తొలిసారి. ఈ సందర్భంగా అబుధాబి జ్యుడీషియల్ డిపార్ట్మెంట్ (ADJD) అండర్ సెక్రటరీ యూసఫ్ సయీద్ అల్ అబ్రీ మాట్లాడుతూ.. ఈ ప్రాంతంలో శాసన, న్యాయ వ్యవస్థ కొనసాగుతున్న అభివృద్ధి ప్రయత్నాలకు మద్దతుగా నిలుస్తుందన్నారు. అంతర్జాతీయ ఉత్తమ పద్ధతులకు అనుగుణంగా ముస్లిమేతరుల సివిల్ పర్సనల్ చట్టాన్ని రూపొందించామన్నారు. వారి సంస్కృతి, ఆచారాలు, భాష పరంగా వారికి దగ్గరగా ఉండే గుర్తింపు పొందిన పౌర సూత్రాలకు దగ్గరగా ఉండేలా నిబంధనలు ఉన్నాయన్నారు. న్యాయ శాఖ యొక్క అధికారిక వెబ్సైట్లో సివిల్ మ్యారేజ్ కాంటాక్ట్ సర్వీస్ రెసిడెంట్స్, విజిటర్స్ కోసం అందుబాటులో ఉందన్నారు. నిబంధనలకు అనుగుణంగా రిజిస్ట్రేషన్ ప్రక్రియ వీడియో కాన్ఫరెన్సింగ్ ద్వారా రిమోట్గా జరుగుతుందని అల్ అబ్రీ అన్నారు.
తాజా వార్తలు
- సౌదీ అరేబియాలో నాలుగేళ్లలో వచ్చే బ్యాంకు సెలవులు..!!
- డ్యూటీ ఫ్రీ డ్రా.. $1 మిలియన్ గెలుచుకున్న కేరళ వాసి..!!
- యూనివర్శిటీ స్ట్రీట్లో రోడ్డు మూసివేత: అష్ఘల్
- కువైట్ లో భారత రాయబారి పనితీరుపై ప్రశంసలు..!!
- AI లో ఇండియా-బహ్రెయిన్ మధ్య సహకారం..!!
- మాదకద్రవ్యాల వాడకాన్ని తగ్గించేందుకు 'హయా' ప్లాట్ఫామ్..!!
- టెర్మినల్–1 ఫ్లైట్ రెస్టారెంట్–విమానం ఎక్కిన ఫీలింగ్తో భోజనం
- బ్రహ్మోత్సవాల్లో ఇస్రో సేవలు తొలిసారి శాటిలైట్ ఆధారంగా భక్తుల గణన: బిఆర్ నాయుడు
- పాకిస్తాన్ సంచలన నిర్ణయం..
- జెనీవాలో దోహాపై ఇజ్రాయెల్ దాడిని ఖండించిన 78 దేశాలు..!!