బహ్రెయిన్ ఎయిర్ పోర్ట్ 5-స్టార్ COVID-19 సేఫ్టీ రేటింగ్‌

- December 29, 2021 , by Maagulf
బహ్రెయిన్ ఎయిర్ పోర్ట్ 5-స్టార్ COVID-19 సేఫ్టీ రేటింగ్‌

బహ్రెయిన్: బహ్రెయిన్ అంతర్జాతీయ విమానాశ్రయానికి (BIA) కరోనావైరస్ వ్యాప్తి నిరోధక అత్యున్నత భద్రతా ప్రోటోకాల్‌లను పాటించినందుకు గుర్తింపుగా 5-స్టార్ COVID-19 ఎయిర్ పోర్ట్ భద్రతా రేటింగ్‌ సర్టిఫికేట్ పొందింది. దీంతో ప్రపంచవ్యాప్తంగా ఉన్న టాప్ 5% విమానాశ్రయాల సరసన BIAన నిలిచింది. డిసెంబర్ 2021లో అంతర్జాతీయ విమాన రవాణా రేటింగ్ సంస్థ అయిన స్కైట్రాక్స్ నిర్వహించిన COVID-19 భద్రతా ప్రమాణాల ఆడిట్ నిర్వహించింది. ఆడిట్ సందర్భంగా COVID-19 మహమ్మారికి సంబంధించిన 175 విభిన్న భద్రతా ప్రోటోకాల్‌లను పరిశీలించారు. ICAO కౌన్సిల్ ఏవియేషన్ రికవరీ టాస్క్ ఫోర్స్ సిఫార్సులకు అనుగుణంగా హెల్త్, క్లీనింగ్, సేఫ్టీ ప్రమాణాలను తనిఖీల్లో భాగంగా పరిశీలించి 5-స్టార్ కోవిడ్-19 ఎయిర్‌పోర్ట్ సేఫ్టీ రేటింగ్ ను నిర్ణయించారు.

 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com