ఏపీ: సీజ్ చేసిన థియేటర్స్ రీఓపెన్..
- December 30, 2021
ఏపీ: ఏపీ ప్రభుత్వానికి టాలీవుడ్ కు మధ్య కోల్డ్ వార్ నడుస్తున్న విషయం తెలిసిందే.. టికెట్ ధరలను తగ్గించారంటూ సినీ పెద్దలు అసహనం వ్యక్తం చేస్తుంటే.. ప్రభుత్వం మాత్రం సామాన్యులకు అందుబాటులో రేట్లు ఉండాలని అంటుంది. ఇక వ్యవహారం పై చర్చలు జరుగుతున్నాయి. ఇదిలా ఉంటే జీవో నెంబర్ 35 రూల్స్ ఫాలో అవ్వడం లేదు అంటూ.. పలు జిల్లాల్లో జాయింట్ కలెక్టర్లు, రెవిన్యూ అధికారులు తనిఖీలు చేసి దాదాపు 83 థియేటర్లకు సీల్ వేశారు. ప్రభుత్వం నిర్ణయించిన టికెట్ రేట్లు వర్కవుట్ కావడం లేదు అని థియేటర్ యాజమాన్యం, డిస్టిబ్యూటర్స్ చెప్తున్నారు.ఈ విషయం పై ఇటీవలే తమ గోడును మంత్రి పేర్ని నాని దగ్గర వినిపించారు తెలుగు ఫిలిం డిస్ట్రిబ్యూటర్స్.
తాజాగా ఏపీలో థియేటర్ల ఓనర్లకు ఊరట కలిగింది. సీల్ చేసిన థియేటర్లు తిరిగి ఒపెన్ చేసేందుకు అనుమతినిచ్చిన ప్రభుత్వానికి తెలుగు ఫిలిం డిస్ట్రిబ్యూటర్స్ కౌన్సిల్ కృతజ్ఞతలు తెలిపింది. ఇటీవల ఏపీ ప్రభుత్వానికి తెలుగు ఫిలిం డిస్ట్రిబ్యూటర్స్ కౌన్సిల్ తరపున కొన్ని విన్నపాలు చేసుకోవడం జరిగింది. అందులో మొదటగా థియేటర్స్ రీ ఒపెనింగ్ కి అనుమతి నిచ్చిన ఆంధ్రప్రధేశ్ ముఖ్యమంత్రి వై.ఎస్ జగన్మోహన్ రెడ్డికి, సినిమాటోగ్రఫి మంత్రి వర్యులు పేర్ని నాని కి తెలుగు ఫిలిం డిస్ట్రిబ్యూటర్స్ కౌన్సిల్ తరపున కృతజ్ఞతలు తెళిప్పారు. మిగతా విన్నపాల పట్ల కూడా సానుకూలంగా స్పందించి మమ్మల్ని ఆదుకుంటారని ఆశిస్తున్నాము అని తెలుగు ఫిలిం డిస్ట్రిబ్యూటర్స్ కౌన్సిల్ ఆశాభావం వ్యక్తం చేసింది. ఇక టికెట్ల రేట్లపై GO 35 అమలులో ఉన్నా.. రేట్ల నిర్దారణ కోసం ఓ కమిటీనీ వేశామని, ఆ రిపోర్ట్ ఆధారంగా మార్పులు చేర్పులు ఉంటాయని హామీ ఇచ్చిన పేర్ని నాని.. ఇటు సీల్ వేసిన థియేటర్లకూ ఊరటనిచ్చారు. ఫైన్లు కట్టి థియేటర్లు తెరుచుకోవచ్చని సూచించారు.
తాజా వార్తలు
- టెర్మినల్–1 ఫ్లైట్ రెస్టారెంట్–విమానం ఎక్కిన ఫీలింగ్‌తో భోజనం
- బ్రహ్మోత్సవాల్లో ఇస్రో సేవలు తొలిసారి శాటిలైట్ ఆధారంగా భక్తుల గణన: బిఆర్ నాయుడు
- పాకిస్తాన్ సంచలన నిర్ణయం..
- జెనీవాలో దోహాపై ఇజ్రాయెల్ దాడిని ఖండించిన 78 దేశాలు..!!
- బహ్రెయిన్ లో కుటుంబ వ్యవస్థ బలోపేతం..!!
- బహ్రెయిన్, కువైట్ నుంచి క్యారీఫోర్ ఔట్.. త్వరలో యూఏఈ?
- రిమైండర్..ఎయిర్ పోర్టుల్లో క్యాష్, గోల్డ్ వెల్లడిపై రూల్స్..!!
- గాజాలో ఇజ్రాయెల్ నేరాలపై UN నివేదికను స్వాగతించిన సౌదీ అరేబియా..!!
- రికార్డులతో ఖరీఫ్ సీజన్‌ను ముగించిన ఒమన్ ఎయిర్..!!
- క్రీడల ద్వారా ఏపీ పర్యాటకానికి ప్రచారం: ఏపీటీడీసీ ఎండీ ఆమ్రపాలి