భార‌త్‌లో తొలి ఒమిక్రాన్ మ‌ర‌ణం..

- December 31, 2021 , by Maagulf
భార‌త్‌లో తొలి ఒమిక్రాన్ మ‌ర‌ణం..

న్యూ ఢిల్లీ: భార‌త్‌లో కరోనా కొత్త‌వేరియంట్ ఒమిక్రాన్ తొలి మ‌ర‌ణం న‌మోదైంది. మ‌హారాష్ట్ర‌కు చెందిన ఒమిక్రాన్ బాధితుడు గుండెపోటుతో మృతి చెందాడు.పూణేలోని పింప్రీ చించువాడ మున్సిప‌ల్ కార్పొరేష‌న్‌కు చెందిన 52 ఏళ్ల వ్య‌క్తి ఒమిక్రాన్‌తో ప్రాణాలు కోల్పోయిన‌ట్లు మ‌హారాష్ట్ర ప్ర‌భుత్వం ప్ర‌క‌టించింది.య‌శ్వంత్ రావు చ‌వాన్ ఆస్ప‌త్రిలో స‌ద‌రు బాధితుడు క‌రోనాకు చికిత్స పొందుతూ ఈ నెల‌(డిసెంబ‌ర్‌)28న మ‌ర‌ణించిన‌ట్లు డాక్ట‌ర్లు తెలిపారు.అత‌డు గుండెపోటుతో చ‌నిపోగా.. అనంతరం అత‌డికి చేసిన ప‌రీక్ష‌ల్లో ఒమిక్రాన్‌గా నిర్థ‌రాణ అయిన‌ట్లు చెప్పారు.

చ‌నిపోయిన వ్యక్తికి ట్రావెల్‌ హిస్టరీ ఉందని.. నైజీరియా నుంచి వచ్చినట్లు మహారాష్ట్ర వైద్యారోగ్యశాఖ ప్రకటించింది. అతడు గత 13 ఏళ్ల నుంచి డయాబెటిస్‌తో బాధపడుతున్న‌ట్లు తెలిపింది. 'బాధితుడు మరణానికి క‌రోనా కారణం కాదు.. కానీ, యాదృచ్ఛికంగా పుణేలోని నేషనల్ వైరాలజీ ల్యాబొరేటరీ నివేదిక అతడికి ఒమిక్రాన్ వేరియంట్‌ సోకినట్లు నిర్ధారించింది' అని మహా వైద్య ఆరోగ్య శాఖ వెల్లడించింది.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com