యూఏఈలో మద్యం తీసుకోవడానికి లైసెన్స్ అవసరమా?

- January 03, 2022 , by Maagulf
యూఏఈలో మద్యం తీసుకోవడానికి లైసెన్స్ అవసరమా?

యూఏఈ: ప్రతి ఎమిరేట్‌కు మద్యం విక్రయం, వినియోగం, వ్యాపారం కోసం చట్టంలో కొంత స్వేచ్ఛ ఇచ్చారు. అదేంటో తెలుసుకుందాం..
ప్రశ్న: యూఏఈలో ఇటీవల ఆమోదించిన చట్టపరమైన సంస్కరణల ప్రకారం.. ఆల్కహాలిక్ డ్రింక్స్ తీసుకోవడానికి ఇప్పటికీ లైసెన్స్ అవసరమా?
జవాబు: యూఏఈ శిక్షా చట్టం 1987 ఫెడరల్ లా నంబర్ 3, ఆర్టికల్ 313ను 2020లో ఫెడరల్ డిక్రీ లా నంబర్ 15 ద్వారా సవరించారు. మద్యం వినియోగానికి సంబంధించి కొంత స్వేచ్ఛ ను ఇచ్చారు. అనుమతించిన సందర్భాలలో, ప్రదేశాలలో మద్యం సేవించడం లేదా వ్యాపారం చేయడం పట్ల ఎటువంటి శిక్ష ఉండదు. అయితే ఆర్టికల్ (1) ప్రకారం.. 21 సంవత్సరాల కంటే తక్కువ వయస్సు ఉన్న వ్యక్తికి ఆల్కహాల్ డ్రింక్స్ అందించినా లేదా విక్రయించినా లేదా అలాంటి వ్యక్తికి అందించాలనే లక్ష్యంతో వాటిని కొనుగోలు చేసినా జైలు శిక్షతో పాటు Dh100,000 నుంచి Dh500,000 జరిమానా విధించబడుతుంది. పైన పేర్కొన్న నిబంధనలను అనుసరించి, యూఏఈ లోని ప్రతి ఎమిరేట్ మద్యం వినియోగం, వ్యాపారం కోసం స్వంత నిబంధనలను రూపొందించుకోవడానికి అధికారం కలిగి ఉంటుంది. ఉదాహరణకు.. దుబాయ్‌లో అధీకృత అవుట్‌లెట్‌ల నుండి చట్టబద్ధంగా మద్యాన్ని కొనుగోలు చేయడానికి ఇప్పటికీ లైసెన్స్ అవసరం.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com