మెడికల్ కాలేజీలో 87 మంది వైద్య విద్యార్థులకు కరోనా
- January 03, 2022
న్యూ ఢిల్లీ: దేశంలో కరోనా మహమ్మారి మళ్లీ విజృంభిస్తోంది. దీంతో కొత్త కేసులు గణనీయంగా పెరుగుతున్నాయి. కొత్త వేరియంట్ ఒమిక్రాన్ భయాందోళనకు గురిచేస్తున్నది. దేశంలోని చాలా రాష్ట్రాలకు ఒమిక్రాన్ వేరియంట్ విస్తరించింది. ఆయా రాష్ట్రాల్లో కరోనా కేసులు పెరుగుదల అధికమవుతోంది. తాజాగా బీహార్ రాష్ట్రంలో చాలా మంది వైద్య విద్యార్థులు వైరస్ బారినపడటం కలకలం రేపుతున్నది. వివరాల్లోకెళ్తే.. పాట్నాలోని నలందా మెడికల్ కళాశాల, ఆస్పత్రిలో (NMCH) పని చేస్తున్న 87 మంది వైద్య విద్యార్థులకు కరోనా సోకింది. కరోనా సోకిన వైద్యులకు లక్షణాలు తక్కువగా ఉన్నాయని, వారంతా ఆస్పత్రిలో క్యాంపస్ ఐసోలేషన్‌లో ఉన్నట్లు పాట్నా డిస్టిక్ మెడికల్ ఆఫీసర్ చంద్రశేఖర్ సింగ్ తెలిపారు. ఇటీవల కాలంలో పాట్నాలో జరిగిన ఇండియన్ మెడికల్ అసోసియేషన్ కార్యక్రమంలో అనేక మంది వైద్యులు పాల్గొన్నారు. ఇందులో నలందా మెడికల్ కాలేజీ వైద్యులు కూడా ఉన్నారు. ఈ నేపథ్యంలోనే ఈ కార్యక్రమంలో పాల్గొన్న వైద్యులు, విద్యార్థుల్లో ఆందోళన వ్యక్తమవుతోంది. వీరందరూ కూడా కరోనా పరీక్షలు చేయించుకోవాలని అధికారులు సూచిస్తున్నారు.
తాజా వార్తలు
- దుబాయ్ హిందూ దేవాలయం, గురుద్వారా మూసివేత..!!
- ఒమన్- బెలారస్ సంబంధాల పై సమీక్ష..!!
- బహ్రెయిన్ లో టూర్ గైడింగ్ బలోపేతానికి కృషి..!!
- సౌదీ ఎంటర్ టైన్ మెంట్ సెక్టర్ హైక్..89 మిలియన్ల విజిటర్స్..!!
- ఖతార్ లో ఆటిజం విద్యార్థుల విద్య బలోపేతం..!!
- మీనా అల్-అహ్మది రిఫైనరీలో అగ్నిప్రమాదం..!!
- ఏపీలో 43 డిగ్రీలకు చేరనున్న ఎండలు..వడగాల్పుల హెచ్చరిక!
- NIC సైంటిస్ట్-బి నోటిఫికేషన్ విడుదల
- విమానాల్లో సీట్ సెలెక్షన్ రూల్ పై కేంద్రం సరికొత్త నిర్ణయం!
- ఢిల్లీలో లక్షల సీసీ కెమెరాల తొలగింపు









