50 ఏళ్ళ పైబడినవారికి ముందస్తు అపాయింట్మెంట్ లేకుండా బూస్టర్ డోసులు
- January 03, 2022
కువైట్ సిటీ: కువైట్ మినిస్ట్రీ ఆఫ్ హెల్త్ వెల్లడించిన వివరాల ప్రకారం 50 ఏళ్ళు పైబడినవారు ముందస్తు అపాయింట్మెంట్ లేకుండానే బూస్టర్ డోస్ పొందవచ్చు. సోమవారం నుంచి ఈ విధానం అందుబాటులోకి వచ్చింది. అయితే, అలాంటివారంతా ఇప్పటికే రెండు డోసులు తీసుకుని వుండాలి. 50 ఏళ్ళ లోపువారైతే, ముందస్తుగా అపాయింట్మెంట్ బూస్టర్ డోసు కోసం తీసుకోవాలి. జబెర్ బ్రిడ్జి, మిష్రెఫ్ మరియు జిలీబ్ అల్ షుయోక్ యూత్ సెంటర్ అలాగే దేశవ్యాప్తంగా పబ్లిక్ ఆసుపత్రుల్లో వ్యాక్సినేషన్ అందుబాటులో వుంది. గత వారం 115,024 మంది బూస్టర్ డోసుని తీసుకోగా, ఇప్పటిదాకా మొత్తంగా బూస్టర్ డోసులు తీసుకున్నవారి సంఖ్య 461,693కి చేరుకుంది.
తాజా వార్తలు
- యూనివర్శిటీ స్ట్రీట్లో రోడ్డు మూసివేత: అష్ఘల్
- కువైట్ లో భారత రాయబారి పనితీరుపై ప్రశంసలు..!!
- AI లో ఇండియా-బహ్రెయిన్ మధ్య సహకారం..!!
- మాదకద్రవ్యాల వాడకాన్ని తగ్గించేందుకు 'హయా' ప్లాట్ఫామ్..!!
- టెర్మినల్–1 ఫ్లైట్ రెస్టారెంట్–విమానం ఎక్కిన ఫీలింగ్తో భోజనం
- బ్రహ్మోత్సవాల్లో ఇస్రో సేవలు తొలిసారి శాటిలైట్ ఆధారంగా భక్తుల గణన: బిఆర్ నాయుడు
- పాకిస్తాన్ సంచలన నిర్ణయం..
- జెనీవాలో దోహాపై ఇజ్రాయెల్ దాడిని ఖండించిన 78 దేశాలు..!!
- బహ్రెయిన్ లో కుటుంబ వ్యవస్థ బలోపేతం..!!
- బహ్రెయిన్, కువైట్ నుంచి క్యారీఫోర్ ఔట్.. త్వరలో యూఏఈ?