బహ్రెయిన్ లో వేజెస్ ప్రొటెక్షన్ సిస్టమ్ ఫేజ్-III స్టార్ట్స్

- January 04, 2022 , by Maagulf
బహ్రెయిన్ లో వేజెస్ ప్రొటెక్షన్ సిస్టమ్ ఫేజ్-III స్టార్ట్స్
బహ్రెయిన్: లేబర్ - యజమానుల మధ్య కమిట్ మెంట్స్, కార్మిక వివాదాలను తగ్గించడానికి వేజెస్ ప్రొటెక్షన్ సిస్టమ్(డబ్ల్యుపిఎస్) ఫేజ్-III ని ప్రారంభించారు. దీని ద్వారా పూర్తి పారదర్శకతతో కార్మికుల హక్కులకు హామీ లభించనుంది. వేజెస్ ప్రొటెక్షన్ సిస్టమ్ ఫేజ్-III అమలుతో కార్మికులకు ఆలస్యమైన జీతాల చెల్లింపు సమస్య తొలగించడానికి దోహద పడుతుంది. 
సిస్టమ్ చేరినప్పటి నుండి అన్ని రకాల మేనేజ్ మెంట్స్ (500+ కార్మికులతో CRS), 88% యజమానులతో (50-499 మంది కార్మికులతో CRS) జీతాల చెల్లింపులను పూర్తి చేశారు.
యజమాని, ఉద్యోగి మధ్య సంతకం చేసిన ఉపాధి ఒప్పందంలోని నిబంధనల ప్రకారం కార్మికుల చట్టబద్ధమైన హక్కుల పరిరక్షణలో WPS వ్యవస్థ ఒక పెద్ద మార్పుగా భావించబడుతుంది. WPS వ్యవస్థతో వివిధ వాణిజ్య రంగాలు, కార్యకలాపాలలో LMRAతో నమోదు చేయబడిన అన్ని సంస్థలకు వర్తిస్తుంది. 
 
 
Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com