ఢిల్లీ ముఖ్యమంత్రి కేజ్రీవాల్‌కు కరోనా…
- January 04, 2022
న్యూ ఢిల్లీ: దేశంలో కరోనా మహమ్మారి వణికిస్తున్నది.రోజువారీ కేసులు భారీగా నమోదవుతున్నాయి.సామాన్యులతో పాటు ప్రముఖులు కూడా కరోనా బారిన పడుతున్నారు. తాజాగా ఢిల్లీ సీఎం కేజ్రీవాల్ కరోనా బారిన పడ్డారు. తనకు కరోనా సోకినట్టు కేజ్రీవాల్ ట్విట్టర్ ద్వారా తెలియజేశారు.తనకు లక్షణాలు తక్కువగా ఉన్నాయని, వైద్యుల సలహా మేరకు హోమ్ ఐసోలేషన్‌లో ఉన్నానని అన్నారు. త్వరలోనే కోలుకొని తిరిగి బయటకు వస్తానని,ఎవరూ భయపడాల్సిన అవసరం లేదని కేజ్రీవాల్ పేర్కొన్నారు.దేశరాజధాని ఢిల్లీలో రోజువారి కేసులు భారీగా నమోదవుతున్నాయి.
అక్కడ పాజిటివిటీ రేటు 6కి పైగా నమోదయింది.ఇప్పటికే ఎల్లో అలర్ట్ నడుస్తున్నది.ఈరోజు నమోదయ్యే కేసులను అనుసరించి రెడ్ అలర్ట్ ప్రకటించే అవకాశం ఉంటుంది. వీకెంట్ లాక్ డౌన్ విధించే అవకాశం ఉన్నట్టుగా నిపుణులు చెబుతున్నారు.కొత్తగా నమోదవుతున్న కేసుల్లో 84 శాతం ఒమిక్రాన్ కేసులు ఉన్నట్టుగా ఢిల్లీ ఆరోగ్యశాఖ మంత్రి స్పష్టం చేసిన సంగతి తెలిసిందే.కేసులు పెరుగుతున్న వేళ తగిన జాగ్రత్తు తీసుకుంటున్నామని అధికారులు చెబుతున్నారు.
తాజా వార్తలు
- బ్యాడ్మింటన్ కోర్టులో కుప్పకూలి భారత ప్రవాసి మృతి..!!
- ఫేక్ గ్లోబల్ విలేజ్ టికెట్ సైట్లపై దుబాయ్ పోలీసులు హెచ్చరిక..!!
- హారన్ విషయంలో రోడ్డు ఘర్షణ.. విద్యార్థికి జైలు శిక్ష..!!
- అల్టరౌటి చికెన్ ఫ్రాంక్ఫర్ట్ పై SFDA హెచ్చరిక..!!
- దుబాయ్ లో చంద్రబాబు గ్రీట్ అండ్ మీట్: డాక్టర్ రవి వేమూరు
- అల్ వక్రా రోడ్డు పాక్షికంగా మూసివేత..!!
- GCC జాయింట్ డిఫెన్స్ కౌన్సిల్ అత్యవసర సమావేశం..!!
- తాజా సంస్కరణలతో సామాన్యులకు భారీ ఊరట
- శ్రీవారి బ్రహ్మోత్సవాలకు భారీ భద్రతా ఏర్పాట్లు
- వడ్డీ రేట్లను 25 బేసిస్ పాయింట్లు తగ్గించిన QCB..!!