ఒమన్ హెల్త్ మినిస్ట్రీలో కొత్త ఎంప్లాయ్ ఇవాల్యూయేషన్ సిస్టమ్ ప్రారంభం

- January 05, 2022 , by Maagulf
ఒమన్ హెల్త్ మినిస్ట్రీలో కొత్త ఎంప్లాయ్ ఇవాల్యూయేషన్ సిస్టమ్ ప్రారంభం

ఒమన్: సిబ్బందికి ప్రమోషన్లు, వేతనాలను పెంచేందుకు వ్యక్తిగత పనితీరు, సామర్థ్యాన్ని పరిగణనలోకి తీసుకునేందుకు ఒమన్ ఆరోగ్య మంత్రిత్వ శాఖ కొత్త ఎంప్లాయ్ ఇవాల్యూయేషన్ సిస్టమ్ ను ఆదివారం ప్రారంభించింది. అరబిక్‌లోని “ఎజాడా” పేరుతో ఈ వ్యవస్థను ఏర్పాటు చేసింది. ఆర్థిక వైవిధ్యాన్ని పెంచడం, స్థిరమైన ఉపాధి అవకాశాలను సృష్టించడం, అందరికీ మంచి జీవన ప్రమాణాలను కలిగి ఉండేలా చేపట్టిన ఒమన్ విజన్ 2040 ఫ్రేమ్‌వర్క్‌లో భాగంగా దీన్ని తీసుకొచ్చింది. ఎజాడా సిస్టమ్ ఎంప్లాయ్ పనితీరును, సామర్థ్యాన్ని అంచనా వేస్తుంది. ఉద్యోగుల మధ్య పోటీ తత్వాన్ని పెంపొందిస్తుంది.
కొత్త ఇవల్యూయేషన్ సిస్టమ్ వల్ల ఎంప్లాయ్ పనితీరులో పారదర్శకత పెరగడం, పని నాణ్యతను మెరుగుపరుస్తుందని ప్రభుత్వం తెలిపింది.

 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com