ఖతార్ లో కొత్త కోవిడ్ ఆంక్షలు.. వ్యాక్సిన్ తీసుకునోళ్లకు మాత్రమే మాల్స్‌లో ఎంట్రీ

- January 06, 2022 , by Maagulf
ఖతార్ లో కొత్త కోవిడ్ ఆంక్షలు.. వ్యాక్సిన్ తీసుకునోళ్లకు మాత్రమే మాల్స్‌లో ఎంట్రీ

ఖతార్: COVID-19 కేసులు పెరుగుతున్న నేపథ్యంలో ఖతార్ క్యాబినెట్ కొత్త ఆంక్షలను ప్రకటించింది. ఇవి జనవరి 8 నుండి అమలులోకి రానున్నాయి.కొత్త నిబంధనల ప్రకారం.. పాఠశాలలు, కిండర్ గార్టెన్‌లలోని విద్యార్థులకు 27 జనవరి 2022 వరకు ఆన్‌లైన్ క్లాసులను కొనసాగిస్తారు. వివాహం, పార్టీలు 30 శాతం సామర్థ్యంతో గరిష్టంగా 40 మంది వ్యక్తులతో ఇంటి లోపల జరుపుకునేందుకు అనుమతిస్తారు. ఆరుబయట వివాహాలకు 50 శాతం సామర్థ్యంతో (80 మంది కంటే తక్కువ మంది ) అనుమతిస్తారు. పూర్తిగా టీకాలు తీసుకున్న వ్యక్తులకు మాత్రమే మాల్స్‌లోకి అనుమతించబడతారు. "ఖతార్ క్లీన్" ప్రోగ్రామ్ సర్టిఫికేట్ ఉన్నవారికి రెస్టారెంట్‌లు, కేఫ్‌లు 50 శాతం ఇండోర్, 75 శాతం కెపాసిటీ అవుట్‌డోర్‌లో తెరిచి ఉంటాయి. 12 సంవత్సరాల కంటే తక్కువ వయస్సు ఉన్న పిల్లలు టీకాలు వేసిన పెద్దలతో పాటు మాత్రమే అనుమతించబడతారు. మార్కెట్లు వారంలోని అన్ని రోజులలో పనిచేస్తాయి. సామర్థ్యం 75% మించకూడదు. పబ్లిక్ పార్కులు, బీచ్‌లు, కార్నిచ్‌లలో గుమిగూడేందుకు ఇప్పటికీ గరిష్టంగా 15 మంది వ్యక్తులు లేదా ఒకే ఇంట్లో ఉండే కుటుంబ సభ్యులను అనుమతిస్తారు. ఉద్యానవనాలు, వినోద కేంద్రాలు, ఈత కొలనులు, నీటి పార్కులు బహిరంగ ప్రదేశాల్లో 75 శాతానికి మించకుండా 50 శాతం సామర్థ్యంతో పనిచేస్తాయి. ప్రార్థనల కోసం మసీదులు తెరిచి ఉంటాయి, కానీ 12 ఏళ్లలోపు వారిని అనుమతించరు.

 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com