విదేశాల నుంచి వచ్చే వారికి తప్పనిసరి క్వారంటైన్...
- January 07, 2022
న్యూఢిల్లీ: భారత్‌లో కరోనా కేసులు పెరుగుతున్న నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం ట్రావెల్ గైడ్‌లైన్స్ సవరించింది.విదేశాల నుంచి వచ్చే ప్రయాణికులకు ఏడు రోజుల హోం క్వారంటైన్ తప్పనిసరి చేసింది. ‘ఎట్ రిస్క్’ దేశాల నుంచి వచ్చే వారు కరోనా పరీక్షల కోసం నమూనాలు ఇవ్వాల్సి ఉంటుంది. కొత్త నిబంధనల ప్రకారం.. టెస్టు ఫలితాలు వచ్చిన తర్వాతే ఎయిర్‌పోర్టు నుంచి వెళ్లేందుకు అనుమతి ఇస్తారు.
ఫలితాల్లో నెగటివ్ వచ్చినవారు ఇంట్లో ఏడు రోజులపాటు క్వారంటైన్లో ఉండాలి. ఎనిమిదో రోజు ఆర్టీ-పీసీఆర్ టెస్టు చేయించుకోవాలి. ఆ పరీక్షల్లో కనుక పాజిటివ్ వస్తే తర్వాతి పరీక్షల నిమిత్తం జినోమ్ సీక్వెన్సింగ్ పరీక్ష కోసం పంపిస్తారు. బాధితుడిని ఐసోలేషన్‌కు తరలించి స్టాండర్డ్ ప్రొటోకాల్ ప్రకారం చికిత్స అందిస్తారు. బాధితుడితో కలిసి ప్రయాణించిన వారిని రాష్ట్రాలు గుర్తించాల్సి ఉంటుంది. పరీక్షల్లో వారికి నెగటివ్ అని తేలితే ఏడు రోజులపాటు స్వీయ పర్యవేక్షణ చేసుకుంటూ జాగ్రత్తగా ఉండాలి.
తాజా వార్తలు
- సౌదీ అరేబియాలో నాలుగేళ్లలో వచ్చే బ్యాంకు సెలవులు..!!
- డ్యూటీ ఫ్రీ డ్రా.. $1 మిలియన్ గెలుచుకున్న కేరళ వాసి..!!
- యూనివర్శిటీ స్ట్రీట్‌లో రోడ్డు మూసివేత: అష్ఘల్
- కువైట్ లో భారత రాయబారి పనితీరుపై ప్రశంసలు..!!
- AI లో ఇండియా-బహ్రెయిన్ మధ్య సహకారం..!!
- మాదకద్రవ్యాల వాడకాన్ని తగ్గించేందుకు 'హయా' ప్లాట్‌ఫామ్..!!
- టెర్మినల్–1 ఫ్లైట్ రెస్టారెంట్–విమానం ఎక్కిన ఫీలింగ్‌తో భోజనం
- బ్రహ్మోత్సవాల్లో ఇస్రో సేవలు తొలిసారి శాటిలైట్ ఆధారంగా భక్తుల గణన: బిఆర్ నాయుడు
- పాకిస్తాన్ సంచలన నిర్ణయం..
- జెనీవాలో దోహాపై ఇజ్రాయెల్ దాడిని ఖండించిన 78 దేశాలు..!!