2022 తొలి వీకెండ్: మసీదుల వద్ద ప్రత్యేక ప్రార్థనలు

- January 07, 2022 , by Maagulf
2022 తొలి వీకెండ్: మసీదుల వద్ద ప్రత్యేక ప్రార్థనలు

యూఏఈ: దేశంలో 2022 సంవత్సరానికి సంబంధించి తొలి వారాంతాన్ని ప్రారంభిస్తూ అలాగే తొలి శుక్రవారం ప్రార్థనల్ని ఘనంగా నిర్వహించారు. జనవరి 1 నుంచి సరికొత్తగా వీకెండ్‌ని తీర్చిదిద్దుతూ యూఏఈ నిర్ణయం తీసుకున్న విషయం విదితమే.వారంలో రెండున్నర రోజులు సెలవు దినాలు కాగా, నాలుగున్నర రోజులు మాత్రమే పని దినాలు నిర్ణయిస్తూ ప్రకటన విడుదల చేశారు. ఆ ప్రకటన అమల్లోకి వచ్చింది. కాగా, షార్జాలో మూడు రోజుల వీకెండ్ ప్రకటించారు. చాలా ప్రైవేటు కంపెనీలు శని, ఆదివారాల్లో తమ ఉద్యోగులకు సెలవుల్ని ప్రకటించాయి. శుక్రవారం ఒక్క పూట మాత్రమే పని సమయాన్ని కుదించారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com