భారత్‌లో కరోనా కేసుల వివరాలు
- January 10, 2022
న్యూ ఢిల్లీ: భారత్‌లో కరోనా కేసులు రోజురోజుకు దేశంలో పెరిగిపోతున్నాయి. మొన్నటి వరకు తగ్గుముఖం పట్టిన కరోనా మహమ్మారి మరోసారి విజృంభిస్తోంది. దక్షిణాఫ్రికాలో వెలుగు చూసిన కొత్త వేరియంట్ ఒమిక్రాన్ ప్రభావం భారత్‌లో కనిపిస్తోంది. అనుకున్నదానికంటే శరవేగంగా ఒమిక్రాన్ వ్యాప్తి చెందుతున్న నేపథ్యంలో కరోనా కేసులు భారీగా నమోదువుతున్నాయి. గత 10 రోజుల క్రితం దేశవ్యాప్తంగా 50 వేల లోపు నమోదైన కరోనా కేసులు కేసులు ఇప్పుడు లక్ష 50 వేలకు పైగా నమోదవుతున్నాయి.
తాజాగా దేశవ్యాప్తంగా నిన్న ఒక్కరోజే 1,79,723 కరోనా కేసులు నమోదయ్యాయి. అంతేకాకుండా గడిచిన 24 గంటల్లో 146 మంది కరోనా బారినపడి మరణించారు. ప్రస్తుతం దేశవ్యాప్తంగా 7,23,619 కరోనా యాక్టివ్ కేసులు ఉన్నాయి. దేశంలో పాజిటివిటీ రేటు 13.29 శాతంగా ఉన్నట్లు అధికారులు వెల్లడించారు. దీంతో పాటు దేశవ్యాప్తంగ ఒమిక్రాన్ కేసుల సంఖ్య 4,033కు చేరుకుంది. అయితే నేడు కేంద్ర ఆరోగ్య శాఖ మంత్రి మాండవీయ రాష్ట్రాల ఆరోగ్య శాక మంత్రులతో కరోనా విజృంభన అరికట్టేందుకు చర్చించనున్నారు.
తాజా వార్తలు
- అరుదైన కొండచిలువల అక్రమ రవాణా భగ్నం..!!
- సౌదీ అరేబియాలో బార్బర్ షాపులకు కొత్త నిబంధనలు..!!
- ఢిల్లీ పోలీసుల పై రాహుల్ గాంధీ ఆగ్రహం
- బహ్రెయిన్ లో ట్రాఫిక్ సేవల ఫీజు మినహాయింపు ప్రతిపాదన తిరస్కరణ..!!
- Tajikistan Launches International Dialogue on Sustainable Tourism and Heritage Preservation
- స్కూల్ గోడపై రాతలు.. వ్యక్తి అరెస్ట్..!!
- అల్ కరానా ప్రాంతంలో అత్యధిక వర్షపాతం..!!
- యూఏఈ లాటరీలో భారతీయుడికి Dh5 మిలియన్ల జాక్పాట్..!!
- క్యాబిన్ ఎక్సలెన్స్ సెంటర్ ఏర్పాటుకు జీఎంఆర్ ఏరో టెక్నిక్ ఒప్పందం
- మహారాష్ట్ర హైరైజ్ బిల్డింగ్లో అగ్నిప్రమాదం..ఇద్దరు మహిళలు సజీవదహనం







