పట్టాలెక్కనున్న ఖతార్- సౌదీ రైల్వే లైన్..!
- January 10, 2022
దోహా: GCC సంక్షోభానికి ముగింపు తెచ్చిన అల్-ఉల్లా డిక్లరేషన్‌పై సంతకం చేసిన ఒక సంవత్సరం తర్వాత ఖతార్, సౌదీ అరేబియా మధ్య సంబంధాలు శరవేగంగా బలపడుతున్నట్లు, అభివృద్ధి చెందుతున్నట్లు కనిపిస్తోంది. రెండు దేశాలకు చెందిన రవాణా మంత్రులు గత వారం దోహాలో సమావేశమయ్యారు. ఈ సంధర్భంగా రెండు దేశాలను కలిపే రైలు లైన్ ఏర్పాటుపై చర్చించారు. ఖతార్ రవాణా మంత్రి జాసిమ్ అల్-సులైతి, సౌదీ మంత్రి సలేహ్ బిన్ నాసర్ అల్-జాసర్ దీనిపై చర్చలు జరిపారు. దీంతో పాటు రవాణా, పౌర విమానయానం, ఓడరేవులు, అలాగే రైల్వే రంగాలలో సహకారం యొక్క అంశాలకు సంబంధించి కూడా వారు చర్చించారు. అనంతరం ఇద్దరు మంత్రులు ఇతర అధికారులతో కలిసి దోహా మెట్రో ప్రాజెక్ట్‌ను కూడా సందర్శించారు. అక్కడ వారికి ఖతార్ రైల్వేస్ కంపెనీ అధికారులు ప్రాజెక్ట్ యొక్క విశేషాలను వివరించారు. ప్రతిపాదిత రైలు లింక్ ప్రాజెక్ట్ రెండు దేశాల మధ్య దౌత్య సంక్షోభం కారణంగా 2016లో రద్దు చేశారు. ఖతార్ యూనివర్శిటీ యొక్క ఇబ్న్ ఖల్డాన్ సెంటర్‌లో అసిస్టెంట్ ప్రొఫెసర్ డాక్టర్ అలీ బాకీర్ మాట్లాడుతూ.. GCC రాష్ట్రాల మధ్య ఏకీకరణ, అంతర్ సంబంధాన్ని ఈ ప్రాజెక్ట్ మరింతగా ముందుకు తీసుకు పోతుందన్నారు. రాజకీయ వివాదాల కారణంగా తలెత్తే నష్టం గురించి 2017 గల్ఫ్ సంక్షోభం చూపించింది. ఇప్పుడు అలాంటి సంక్షోభం లేనందున, ఇటువంటి ప్రాజెక్టులను పునఃప్రారంభించే అవకాశం ఉందన్నారు. ఖతార్, సౌదీ అరేబియా మధ్య ఉన్న సాల్వా సరిహద్దు ద్వారా ప్రతి వారం వేల మంది ప్రజలు ప్రయాణాలు చేస్తారు. బంధువులను చూసేందుకు, ఉమ్రా లేదా హజ్ తీర్థయాత్రలను చేసేందుకు వెళుతుంటారు.
తాజా వార్తలు
- సౌదీ అరేబియాలో నాలుగేళ్లలో వచ్చే బ్యాంకు సెలవులు..!!
- డ్యూటీ ఫ్రీ డ్రా.. $1 మిలియన్ గెలుచుకున్న కేరళ వాసి..!!
- యూనివర్శిటీ స్ట్రీట్‌లో రోడ్డు మూసివేత: అష్ఘల్
- కువైట్ లో భారత రాయబారి పనితీరుపై ప్రశంసలు..!!
- AI లో ఇండియా-బహ్రెయిన్ మధ్య సహకారం..!!
- మాదకద్రవ్యాల వాడకాన్ని తగ్గించేందుకు 'హయా' ప్లాట్‌ఫామ్..!!
- టెర్మినల్–1 ఫ్లైట్ రెస్టారెంట్–విమానం ఎక్కిన ఫీలింగ్‌తో భోజనం
- బ్రహ్మోత్సవాల్లో ఇస్రో సేవలు తొలిసారి శాటిలైట్ ఆధారంగా భక్తుల గణన: బిఆర్ నాయుడు
- పాకిస్తాన్ సంచలన నిర్ణయం..
- జెనీవాలో దోహాపై ఇజ్రాయెల్ దాడిని ఖండించిన 78 దేశాలు..!!