నకిలీ బ్యాంక్ స్టేట్మెంట్ల కేసులో ఏజెంట్ పై విచారణ

- January 10, 2022 , by Maagulf
నకిలీ బ్యాంక్ స్టేట్మెంట్ల కేసులో ఏజెంట్ పై విచారణ

బహ్రెయిన్: ఇద్దరు వ్యక్తుల కోసం రెండు వాణిజ్య రిజిస్ట్రేషన్లను పొందేందుకు నకిలీ బ్యాంక్ స్టేట్మెంట్లను రూపొందించారని ఆరోపణలు ఎదుర్కొంటున్న 29 ఏళ్ల క్లియరెన్స్ ఏజెంట్ కేసులో హై క్రిమినల్ కోర్టు విచారణ ప్రారంభించింది. LMRA ప్రాంగణానికి తరచుగా వచ్చే అరబ్ జాతీయుడి ప్రవర్తనపై లేబర్ మార్కెట్ రెగ్యులేటరీ అథారిటీకి అనుమానం రావడంతో నిందితుడు పట్టుబడ్డాడు. తదుపరి విచారణలో ఆ వ్యక్తి తన కంపెనీని రిజిస్టర్ చేసుకోవడానికి LMRAలో దాఖలు చేసిన పత్రాలు నకిలీవని తేలింది. తరువాత పబ్లిక్ ప్రాసిక్యూషన్ ద్వారా విచారణలో అతను బహ్రెయిన్ క్లియరింగ్ ఏజెంట్ విషయాన్ని వెల్లడించాడు. క్లియరింగ్ ఏజెంట్ మొత్తం ప్రక్రియను సూత్రధారిగా గుర్తించిన అధికారులు.. సీఆర్ పొందేందుకు అతడే ఫార్మాలిటీలను పూర్తి చేసినట్టు గుర్తించారు. అయితే సదరు 29 ఏళ్ల ఏజెంట్ తను ఎలాంటి తప్పు చేయలేదని తనపై వచ్చిన ఆరోపణలను తోసిపుచ్చాడు. బ్యాంక్ స్టేట్మెంట్లను పొందేందుకు సంబంధించిన ఫార్మాలిటీలను పూర్తి చేసేందుకు ఇతర క్లియరెన్స్ ఏజెంట్లకు బాధ్యతలు అప్పగించినట్లు తెలిపాడు. సిఆర్ జారీకి సంబంధించిన లాంఛనాలను పూర్తి చేయడానికి అరబ్ వ్యక్తి నన్ను సంప్రదించాడని, కానీ, బ్యాంకు ఖాతా లేదని చెప్పగా అతని కోసం బ్యాంకు ఖాతా స్టేట్ మెంట్లను మరొక క్లియరెన్స్ ఏజెంట్ నుండి తీసుకున్నట్లు అతను విచారణలో వెల్లడించాడు

 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com