దుబాయ్‌లో ఫ్రెండ్ ను హత్య చేసిన ఆసియన్‌కు జీవితఖైదు
- January 11, 2022దుబాయ్: ఫ్రెండ్ ను హత్య చేసిన ఆసియన్‌కు జీవితకాలం జైలు శిక్ష పడింది. తన సోదరితో ఎఫైర్ పెట్టుకునేందుకు ప్రయత్నం చేస్తున్న విషయాన్ని తెలుసుకున్న ఒక ఆసియా వాసి తన తోటి స్నేహితుడిని హత్య చేశాడు. దుబాయ్ క్రిమినల్ కోర్ట్ హంతకుడికి జీవిత ఖైదు శిక్ష విధించింది. ఆ తర్వాత దేశ బహిష్కరణను విధించింది. తీర్పును అప్పీల్ కోర్టు సమర్థించింది. ఈ కేసు గత ఏడాది ఫిబ్రవరిలో జెబెల్ అలీలోని ఇసుక ప్రాంతంలో జరిగింది. దర్యాప్తు ప్రకారం, నిందితుడు బాధితుడితో స్నేహం, వ్యాపార సంబంధాలు కలిగి ఉన్నాడు. హత్యకు రెండు రోజుల ముందు వారి మధ్య వాగ్వాదం జరిగింది. బాధితుడు తన స్వదేశంలో ఉన్న తన సోదరి ఫోన్ చేసి తనతో అక్రమ సంబంధాన్ని ఏర్పరచుకోమని బలవంతం చేస్తున్నాడని, హంతకుడు గుర్తించిన తర్వాత ఇద్దరి మధ్య వివాదం మరింత ముదిరింది. తన సోదరికి ఫోన్ చేయొద్దని అనుమానితుడు బాధితుడికి చెప్పినా పెడచెవిన పెట్టాడు. తన సోదరిని పదేపదే సంప్రదించడం.. నిందితున్ని మరింత రెచ్చగొట్టింది.
దుబాయ్ పబ్లిక్ ప్రాసిక్యూషన్ నిందితుడిని హత్య చేయాలనే ఉద్దేశ్యంతో ముందస్తుగా హత్య చేసినట్లు అభియోగాలు మోపింది. పక్కా ప్రణాళిక ప్రకారమే బాధితుడిని ఇసుక యార్డ్‌కు రప్పించాడని ఆరోపించింది. మొదట కోర్టు నిందితుడికి జీవిత ఖైదు విధించి బహిష్కరణ విధించింది. అయితే పబ్లిక్ ప్రాసిక్యూషన్ తీర్పును అప్పీల్ చేసింది. శిక్షను కఠినతరం చేయాలని కోరింది. దోషికి మరణశిక్ష విధించాలని డిమాండ్ చేసింది. అయితే, అప్పీల్ సెషన్లో బాధితుడిని ముందస్తుగా చంపాలనే ఉద్దేశాన్ని దోషి తిరస్కరించాడు.
తాజా వార్తలు
- ఆ దేశంలోని భారతీయ విద్యార్థులందరూ ఇళ్ల నుంచి బయటకు రాకండి: కేంద్ర మంత్రి ఎస్ జైశంకర్
- ప్రొఫెసర్ వెల్చ్ కు యూఏఈ ప్రెసిడెంట్ బంపరాఫర్..!
- యూఏఈలో స్వల్ప భూకంపం
- 'అర్ధరాత్రి దొంగ'కు ఏడాది జైలు, జరిమానా
- బహ్రెయిన్ టాలెంట్ హబ్.. ఔట్రీచ్ నివేదిక వెల్లడి
- పబ్లిక్ టాయిలెట్లలో జెమ్స్ భయమా? Dh10తో పరిష్కారం..!
- దోహా ఇంటర్నేషనల్ బుక్ ఫెయిర్‌లో కొత్త పోటీలు
- యాదాద్రిలో ప్లాస్టిక్ పై నిషేధం..ఉత్తర్వులు జారీ
- కేరళలో హెపటైటిస్ కలకలం..12 మంది మృతి
- ఏపీ సీఎం జగన్ లండన్‌కు వెళుతుండగా..గన్నవరం ఎయిర్‌పోర్టులో కలకలం