హెల్త్ నిబంధనలు పాటించని 1,115 షాప్స్ మూసివేత

- January 13, 2022 , by Maagulf
హెల్త్ నిబంధనలు పాటించని 1,115 షాప్స్ మూసివేత

కువైట్: కరోనా వైరస్ వ్యాప్తి నేపథ్యంలో హెల్త్ మినిస్ట్రీ అప్రమత్తం అయ్యింది. హెల్త్ మినిస్ట్రీ సూచించిన నిబంధనలు పాటించని సంస్థలపై కఠిన చర్యలు తీసుకుంటుంది. ఇప్పటి వరకు దేశ వ్యాప్తంగా 679,552 మార్కెట్ లు,షాప్స్, సంస్థలను ప్రత్యేక బృందాలు తనిఖీ చేశాయి. ఈ సందర్భంగా ఆరోగ్య అవసరాలను పాటించని 87,989 సంస్థలకు వార్నింగ్ ఇవ్వగా.. నిబంధనలు పాటించడంలో విఫలమైన 13,680 సంస్థలకు నోటీసులు జారీ చేసింది. ఇదే సమయంలో 1,115 దుకాణాలను హెల్త్ రిక్వైర్ మెంట్ అమలును పర్యవేక్షించే కమిటీ మూసివేయించింది.

 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com