అబుధాబిలో న్యూ బార్డర్ రూల్స్
- January 13, 2022
అబుధాబి: యూఏఈ నుండి ఎమిరేట్‌కు ప్రయాణించే వారి కోసం అబుధాబి కొత్త సరిహద్దు నిబంధనలను ప్రవేశపెట్టింది. ఇందులో టూరిస్ట్ ల చెకింగ్ కోసం ప్రత్యేక చర్యలు తీసుకున్నారు. వారి చెకింగ్ ప్రక్రియ వేగంగా పూర్తి అయ్యేందుకు సఫరెట్ చెకింగ్ లైన్ ను ఏర్పాటు చేయనున్నారు. అబుధాబికి విసిట్ ప్లాన్ చేయడానికి ముందు, ప్రవేశ మార్గదర్శకాల గురించి పూర్తిగా తెలుసుకోవాలని టూరిజం ఆపరేటర్లకు డిపార్ట్‌మెంట్ ఆఫ్ కల్చర్ అండ్ టూరిజం (DCT) ఒక సర్క్యులర్ జారీ చేసింది. అబుధాబి - దుబాయ్ బార్డర్ లో ఎమిరేట్ - లేన్ 1 (కుడివైపు)లోకి ప్రవేశించేటప్పుడు పర్యాటకుల ప్రత్యేక లేన్‌ను తీసుకోవాలని డ్రైవర్‌లకు తెలియజేయాలని అందులో సూచించింది. ఎంట్రీ పాయింట్ల వద్ద తనిఖీ కోసం సంబంధిత డాక్యుమెంటేషన్‌ను సిద్ధంగా పెట్టుకోవాలి అని సర్క్యులర్‌లో DCT స్పష్టం చేసింది. అలాగే కోవిడ్-వ్యాక్సినేషన్ పొందిన వ్యక్తులు UAE నుండి అబుధాబిలోకి ప్రవేశించాలనుకునేవారు అల్ హోస్న్ యాప్‌లో గ్రీన్ పాస్ కలిగి ఉండాలన్నారు. కోవిడ్-19 పరీక్షలో నెగిటివ్ వచ్చినప్పుడు 15 రోజుల పాటు గ్రీన్ స్టేటస్ యాక్టివేట్ చేయబడుతుందని తెలిపింది.
తాజా వార్తలు
- రియాద్ విమానాశ్రయం పై దాడి.. 12 మంది మృతి, 309 మందికి గాయాలు
- అరేబియా గల్ఫ్‌లో ఆయిల్ ట్యాంకర్లో అగ్నిప్రమాదం..
- రియాద్ విమానాశ్రయంపై మరోసారి దాడి.. కార్యకలాపాలు తాత్కాలికంగా నిలిపివేత
- వైద్య సేవల్లో మానవీయతకు ప్రాధాన్యం: గవర్నర్ శివ ప్రతాప్ శుక్లా
- జంతర్ మంతర్ లో హైటెన్షన్.. మమత, కేజ్రీవాల్ అరెస్ట్..
- ఏపీ ప్రజలకు అలెర్ట్
- హైదరాబాద్ హైస్పీడ్ రైల్ కారిడార్లు.. భూసేకరణ పై కేంద్రం కీలక ప్రకటన
- యూఏఈలో ఓపెన్ బావులపై భారీ తనిఖీలు..!!
- 136 హౌతీ సైనిక స్థావరాలు ధ్వంసం..!!
- అరేబియా సముద్రంలోని హంప్‌బ్యాక్ వేల్స్ కు ప్రత్యేక గుర్తింపు..!







