వీసా స్క్రీనింగ్ అపాయింట్‌మెంట్ల కోసం SEHA యాప్‌ స్టార్ట్

- January 13, 2022 , by Maagulf
వీసా స్క్రీనింగ్ అపాయింట్‌మెంట్ల కోసం SEHA యాప్‌ స్టార్ట్

అబుధాబి: UAE లో అతిపెద్ద హెల్త్‌కేర్ నెట్‌వర్క్ అయిన అబుధాబి హెల్త్ సర్వీసెస్ కంపెనీ (SEHA).. వీసా స్క్రీనింగ్ సెంటర్‌లలో అపాయింట్‌మెంట్ బుక్ చేసుకునే ప్రక్రియను సులభతరం చేయడానికి SEHA వీసా స్క్రీనింగ్ యాప్‌ను ప్రారంభించింది. ప్రస్తుతం పర్సనల్ బుకింగ్ మాత్రమే అందుబాటులో ఉండగా తదుపరి దశలో వ్యాపార వర్గాలకు అందుబాటులోకి వస్తుంది. ఎమిరేట్‌లో ఉన్న అబుదాబి సిటీ, ముస్సాఫా, అల్ షహమా, బనియాస్, స్వీహాన్, మదీనాత్ జాయెద్, డెల్మా, సిలా, ఘయాతి, అల్ మర్ఫా, ఎతిహాద్ లలో 12 డిసీజ్ ప్రివెన్షన్, స్క్రీనింగ్ సెంటర్‌లను SEHA నిర్వహిస్తోంది. వీటి ద్వారా సర్వీసులను సులభంగా పొందవచ్చు. స్మార్ట్‌ఫోన్ ఆధారిత అపాయింట్‌మెంట్ సర్వీస్‌ను ప్రారంభించడం ద్వారా SEHA బుకింగ్ ప్రక్రియను క్రమబద్ధీకరిస్తోంది. దీంతో వెయిటింగ్ టైమ్ తగ్గుతుంది. SEHA వీసా స్క్రీనింగ్ యాప్ ను iOS, Android ఫోన్‌లలో పనిచేసేలా రూపొందించారు. యాప్ స్టోర్, Google Play స్టోర్ల లో యాప్ అందుబాటులో ఉంది. ఈ సందర్భంగా అంబులేటరీ హెల్త్‌కేర్ సర్వీసెస్‌లో చీఫ్ క్లినికల్ అఫైర్స్ ఆఫీసర్ డాక్టర్ ఒమర్ అల్ హష్మీ మాట్లాడుతూ.. SEHA వ్యాధి నివారణ, స్క్రీనింగ్ కేంద్రాలు - జాయింట్ కమిషన్ ఇంటర్నేషనల్ (JCI)చే గుర్తింపు పొందాయన్నారు. వీసా ప్రక్రియ కోసం పూర్తి స్థాయి వైద్య సేవలను అందిస్తాయని తెలిపారు.

 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com