ఏపీ సీఎం జగన్‌తో చిరంజీవి భేటీ
- January 13, 2022
అమరావతి: ఫ్లైట్ లో ఈ ఉదయం 11గంటలకు హైదరాబాద్ బేగంపేట నుంచి విజయవాడకు బయల్దేరి వెళ్లారు చిరంజీవి. గన్నవరం నుంచి తాడేపల్లి క్యాంప్ ఆఫీస్ కు రోడ్డు మార్గంలో వెళ్లారు. తన ఇంటికి వచ్చిన చిరంజీవికి ఏపీ సీఎం జగన్ సాదరంగా స్వాగతం పలికారు. ఫ్లవర్ బొకే ఇచ్చి వెల్కమ్ చెప్పారు. ఇంట్లోకి వెళ్లిన చిరంజీవి.. ముఖ్యమంత్రికి పుష్ప గుచ్ఛం ఇచ్చారు.ఆ తర్వాత నారింజ రంగు పట్టు కండువాతో జగన్ ను సత్కరించారు.ఈ సందర్భంగా వీరిద్దరూ ఫొటోలకు పోజులిచ్చారు.
ఏపీలో థియేటర్లు, టికెట్ రేట్ల ఇష్యూ, షోల సంఖ్య సహా తెలుగు సినీ ఇండస్ట్రీకి, ఏపీ ప్రభుత్వానికి మధ్య ఉన్న సమస్యలు చిరంజీవి, జగన్ భేటీలో ప్రధానంగా చర్చకు వచ్చే చాన్సుంది. మీటింగ్ కు ముందు విజయవాడలో మీడియాతో మాట్లాడిన చిరంజీవి.. గంట, గంటన్నరలో సీఎంతో చర్చించి వస్తా.. అన్నింటికీ బదులిస్తా అని చెప్పి వెళ్లిపోయారు.
తాజా వార్తలు
- టెర్మినల్–1 ఫ్లైట్ రెస్టారెంట్–విమానం ఎక్కిన ఫీలింగ్‌తో భోజనం
- బ్రహ్మోత్సవాల్లో ఇస్రో సేవలు తొలిసారి శాటిలైట్ ఆధారంగా భక్తుల గణన: బిఆర్ నాయుడు
- పాకిస్తాన్ సంచలన నిర్ణయం..
- జెనీవాలో దోహాపై ఇజ్రాయెల్ దాడిని ఖండించిన 78 దేశాలు..!!
- బహ్రెయిన్ లో కుటుంబ వ్యవస్థ బలోపేతం..!!
- బహ్రెయిన్, కువైట్ నుంచి క్యారీఫోర్ ఔట్.. త్వరలో యూఏఈ?
- రిమైండర్..ఎయిర్ పోర్టుల్లో క్యాష్, గోల్డ్ వెల్లడిపై రూల్స్..!!
- గాజాలో ఇజ్రాయెల్ నేరాలపై UN నివేదికను స్వాగతించిన సౌదీ అరేబియా..!!
- రికార్డులతో ఖరీఫ్ సీజన్‌ను ముగించిన ఒమన్ ఎయిర్..!!
- క్రీడల ద్వారా ఏపీ పర్యాటకానికి ప్రచారం: ఏపీటీడీసీ ఎండీ ఆమ్రపాలి