కువైట్ అంతర్జాతీయ విమానాశ్రయంలో VIV టెర్మినల్ ప్రారంభం
- January 16, 2022
కువైట్: కువైట్ అంతర్జాతీయ విమానాశ్రయంలో VIV టెర్మినల్ ప్రారంభమైంది. కువైట్‌లో VIV ప్రారంభించిన మొదటి ప్రైవేట్ టెర్మినల్ ఇది.టెర్మినల్స్ 1 అండ్ 5 నుండి ఆపరేట్ చేసే ఎయిర్‌లైన్స్, సాధారణ ఏవియేషన్, ప్రైవేట్ జెట్ల కోసం బయలుదేరే/వచ్చే ప్రయాణీకులకు VIV సర్వీసులు అందుబాటులో ఉంటాయి. VIV టెర్మినల్ ప్రయాణీకులకు ప్రైవేట్ చెక్-ఇన్ రిసెప్షన్, హ్యాండ్లింగ్ సేవలు, గౌర్మెట్ ఎ లా కార్టే మీల్స్, ప్రైవేట్ కస్టమ్స్, ఇమ్మిగ్రేషన్ ప్రాంతం, లగ్జరీ సౌకర్యాలను కల్పిస్తుంది.విమానాశ్రయంలో VIV కి రెండు ప్రైవేట్ సూట్లు, ఒక పెద్ద లాంజ్ ఉంది.
ఈ సందర్భంగా VIV టెర్మినల్ జనరల్ మేనేజర్ లైలా అల్-ముక్తార్ మాట్లాడుతూ.. VIV టెర్మినల్ సిబ్బంది అతిథులను తనిఖీ చేయడం, వారి సామాను సేకరించడం, వారు బయలుదేరడానికి వేచి ఉన్నప్పుడు వారి అవసరాలను తీర్చడం వంటి వాటిపై శ్రద్ధ వహిస్తారని తెలిపారు. టెర్మినల్స్ 1, 5 నుండి ప్రయాణించే ప్రయాణీకులకు ప్రస్తుతం సేవలు అందుబాటులో ఉన్నాయని, తదుపరి దశలో ఇతర టెర్మినల్స్ నుండి ప్రయాణించే ప్రయాణీకులకు అందుబాటులోకి తీసుకొస్తామన్నారు. VIV టెర్మినల్‌ను కువైట్ జాతీయ క్యారియర్, జజీరా ఎయిర్వేస్ సంయుక్తంగా నిర్వహిస్తోంది.
తాజా వార్తలు
- సౌదీ అరేబియాలో నాలుగేళ్లలో వచ్చే బ్యాంకు సెలవులు..!!
- డ్యూటీ ఫ్రీ డ్రా.. $1 మిలియన్ గెలుచుకున్న కేరళ వాసి..!!
- యూనివర్శిటీ స్ట్రీట్‌లో రోడ్డు మూసివేత: అష్ఘల్
- కువైట్ లో భారత రాయబారి పనితీరుపై ప్రశంసలు..!!
- AI లో ఇండియా-బహ్రెయిన్ మధ్య సహకారం..!!
- మాదకద్రవ్యాల వాడకాన్ని తగ్గించేందుకు 'హయా' ప్లాట్‌ఫామ్..!!
- టెర్మినల్–1 ఫ్లైట్ రెస్టారెంట్–విమానం ఎక్కిన ఫీలింగ్‌తో భోజనం
- బ్రహ్మోత్సవాల్లో ఇస్రో సేవలు తొలిసారి శాటిలైట్ ఆధారంగా భక్తుల గణన: బిఆర్ నాయుడు
- పాకిస్తాన్ సంచలన నిర్ణయం..
- జెనీవాలో దోహాపై ఇజ్రాయెల్ దాడిని ఖండించిన 78 దేశాలు..!!