60 ఏళ్ళ పైబడ్డవారి వీసా రెన్యువల్స్: పరిష్కారంపై స్పెషల్ ఫోకస్

- January 17, 2022 , by Maagulf
60 ఏళ్ళ పైబడ్డవారి వీసా రెన్యువల్స్: పరిష్కారంపై స్పెషల్ ఫోకస్

కువైట్: 60 ఏళ్ళు పైబడి, డిగ్రీ లేని రెసిడెంట్స్‌కి సంబంధించిన రెసిడెన్సీ రెన్యువల్ వ్యవహారాన్ని పరిష్కరించేందుకోసం అత్యంత ప్రాధాన్యతాంశంగా భావించి తగిన చర్యలు చేపడుతున్నారు. మినిస్టర్ ఆఫ్ జస్టిస్ మరియు స్టేట్ మినిస్టర్ ఫర్ ఇంటిగ్రిటీ ఎఫైర్స్ జమాల్ అల్ జలావి ఈ విషయాన్ని పరిష్కరించేందుకు శక్తివంచన లేకుండా కృషి చేస్తున్నారు. క్యాబినెట్ డిక్రీ ద్వారా పబ్లిక్ అథారిటీ ఫర్ మేన్ పవర్ వంటి కొన్ని ప్రభుత్వ అథారిటీల న్యాయ పరిధిని ఇతర సంస్థలకు బదిలీ చేసేలా క్యాబినెట్ డిక్రీ కోసం మినిస్టర్ ఎదురు చూస్తున్నారు. విశ్వసనీయ వర్గాల సమాచారం ప్రకారం రెన్యువల్ ఫీజు 1,000 కువైటీ దినార్ల నుంచి 1,100 కువైటీ దినార్ల వరకు (ఏడాదికి) వుండవచ్చు.. అది కూడా హెల్త్ ఇన్స్యూరెన్స్‌తో కలిపి.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com