ఆగకుండా దగ్గు వస్తే టీబీ పరీక్ష చేయించుకోండి..స్టెరాయిడ్స్ వద్దు..భారత ఆరోగ్య శాఖ హెచ్చరిక
- January 18, 2022
న్యూ ఢిల్లీ: కొవిడ్ ట్రీట్మెట్ లో భాగంగా కేంద్రం కొత్త గైడ్ లైన్స్ రిలీజ్ చేసింది. తేలికపాటి, మధ్య, తీవ్ర లక్షణాలతో బాధపడేవారు ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలో అందులో వివరించింది.
ట్రీట్మెంట్ లో భాగంగా కొవిడ్-19 రోగులకు స్టెరాయిడ్స్ ఇవ్వడం ఆపేయాలని డాక్టర్లకు నీతి అయోగ్ టాస్క్ ఫోర్స్ చీఫ్ డాక్టర్ వీకే పౌల్ సూచించారు.
స్టెరాయిడ్స్ వల్ల చాలా నష్టాలున్నాయని, ఎక్కువ కాలం వాడితే బ్లాక్ ఫంగస్ లాంటి ఇన్ఫెక్షన్లు సోకే ప్రమాదముందని హెచ్చరించారు. రెండు లేదా మూడు వారాల కంటే ఎక్కువగా దగ్గు ఆగకుండా వస్తే టీబీ పరీక్ష తప్పక చేయించుకోవాలని చెప్పారు.
అలా కాకుండా శ్వాస తీసుకోవడంలో ఏదైనా తేలికపాటి సమస్యలు వాటిని స్వల్ప లక్షణాలుగా పరిగణించాలి. ముందస్తు జాగ్రత్తగా హోం ఐసోలేషన్ లో ఉండి ఐదు రోజులైన తగ్గకపోతే.. వైద్యుల్ని సంప్రదించాలి. పరిస్థితిని బట్టి.. ఆక్సిజన్ లెవల్ 90-93 మధ్య ఉన్న కేసులను మోడరేట్ గా భావిస్తారు. అలాంటి వారికి ఆక్సిజన్ సపోర్ట్ అవసరం అవుతుంది.
ఓ మాదిరి నుంచి తీవ్రంగా కరోనా లక్షణాలు ఉన్న వారికి రెమెడెసివిర్ డ్రగ్ ఇవ్వొచ్చు. మూత్ర సంబంధిత వ్యాధులు ఉన్నవారికి, ఆక్సిజన్ సపోర్ట్ అవసరం లేని వారికి ఈ ఔషధాన్ని ఇవ్వకూడదు. తీవ్ర వ్యాధి లక్షణాలు ఉన్నవారికి 48 గంటలలోపు టోసిలిజుమాబ్ డ్రగ్‌ను ఇవ్వవచ్చు.
ఆక్సిజన్ లెవల్ 90 కన్నా తక్కువగా ఉంటే సీరియస్ గా పరిగణించి.. వెంటనే ఐసీయూ సదుపాయం ఉండే గదికి మార్చాలని కొత్త గైడ్‌లైన్స్‌లో పేర్కొన్నారు.
తాజా వార్తలు
- సౌదీలో కొత్త పండ్లు, కూరగాయల ప్యాకేజింగ్ నిబంధనలు..!!
- వెబ్ సమ్మిట్ ఖతార్ 2026కి విస్తృత ఏర్పాట్లు..!!
- దుబాయ్ మిరాకిల్ గార్డెన్ సీజన్ 14 వచ్చేసింది..!!
- వరల్డ్ టాప్ 10 సురక్షితమైన దేశాలలో ఒమన్..!!
- కువైట్ లో "దిస్ ఈస్ యువర్ రోల్" ప్రారంభం..!!
- బహ్రెయిన్, ఇండియా మధ్య లీగల్, ట్యాక్స్ సహకారం..!!
- ఒమన్‌తో మ్యాచ్..టీమ్ఇండియాకు ఎంతో ప్రత్యేకం..
- హైదరాబాద్: గిన్నిస్ బుక్ లో తెలంగాణ ‘బతుకమ్మ’
- భారీ వర్షానికి చిగురుటాకులా వణికిన హైదరాబాద్..
- నటుడు రోబో శంకర్ మృతి..