'బూస్టర్ డోస్ కోసం పేర్లను నమోదు చేసుకోండి'

- January 19, 2022 , by Maagulf
\'బూస్టర్ డోస్ కోసం పేర్లను నమోదు చేసుకోండి\'

కువైట్: యాంటీ కరోనా వైరస్ వ్యాక్సిన్ 'థర్డ్ బూస్టర్ డోస్' తీసుకోవడానికి ప్రైవేట్ నర్సరీల యజమానులు తమ ఉద్యోగుల పేర్లను నమోదు చేసుకోవాలని సోషల్ ఎఫైర్స్, కమ్యూనిటీ డెవలప్‌మెంట్ మంత్రిత్వ శాఖ అండర్ సెక్రటరీ అబ్దుల్ అజీజ్ షుయబ్ పిలుపునిచ్చారు. జనవరి 27న సాల్మియా ప్రాంతంలోని ప్రైవేట్ నర్సరీల్లోని కార్మికులందరికీ కరోనా వైరస్‌ వ్యాక్సిన్‌ వేయించేందుకు క్యాంపెయిన్ ను ప్రారంభించనున్నట్లు అజీజ్ తెలిపారు. నర్సరీ యజమానులు తమ ఉద్యోగులకు వైరస్‌ బారిన పడకుండా వ్యాక్సిన్లు వేయడానికి గతంలో నిర్వహించిన టీకా ప్రచారాల సందర్భంగా నర్సరీ యాజమాన్యం అందించిన సహకారాన్ని ఆయన ప్రశంసించారు. రెండవ డోస్ తీసుకున్న 6 నెలలు దాటిన వారికి మూడవ బూస్టర్ డోస్ ఇవ్వబడుతుందన్నారు. నర్సరీల యజమానులు https://forms.gle/piTjusAgbpHjGHAv5 అనే వెబ్‌సైట్ లింక్ ద్వారా రిజిస్టర్ చేసుకోవాలని సూచించారు. ప్రతి ఒక్కరూ ఈ క్యాంపెయిన్‌లో పాల్గొనాలని షుయబ్ పిలుపునిచ్చారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com