సౌదీ అరేబియాను అతలాకుతలం చేస్తున్న చలిగాలులు
- January 19, 2022
రియాద్: ప్రస్తుతం సౌదీ అరేబియాలోని కొన్ని ప్రాంతాలను చలిగాలులు అతలాకుతలం చేస్తున్నాయి. రాబోయే కొద్ది రోజుల్లో రాజధాని నగరం రియాద్‌లో ఉష్ణోగ్రతలు సున్నా స్థాయికి చేరుకోవచ్చని నేషనల్ సెంటర్ ఆఫ్ మెటియరాలజీ (NCM) అంచనా వేసింది. ఉత్తర సరిహద్దు ప్రాంతంలోని తురైఫ్ గవర్నరేట్‌తో పాటు తబుక్, అరార్, రఫ్హా, షక్రా, ఉత్తర ప్రాంతాలలోని ఇతర నగరాలు/గవర్నరేట్‌లలో గడ్డకట్టే ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. NCM ప్రతినిధి హుస్సేన్ అల్-ఖహ్తానీ మాట్లాడుతూ.. ప్రస్తుతం దేశంలో చలిగాలుల తీవ్రత అధికంగా ఉందన్నారు. శీతాకాలపు మొదటి మూడవ భాగంలో ఉన్నామని, ప్రస్తుతం చల్లని గాలుల తీవ్రత కారణంగా ఉత్తర, మధ్య, తూర్పు ప్రాంతాలు ప్రభావితమవుతాయన్నారు. రానున్న రోజుల్లో రియాద్‌లో ఉష్ణోగ్రతలు సున్నా డిగ్రీల సెల్సియస్‌కు చేరుకునే అవకాశం ఉందని, దక్షిణాది ప్రాంతాల్లో ఉష్ణోగ్రతలు మరింత తగ్గుతాయని అల్-ఖహ్తానీ చెప్పారు. తూర్పు ప్రావిన్స్ తో పాటు రియాద్‌లో కూడా వర్షాలు కురిసే అవకాశం ఉందని ఆయన చెప్పారు. ఉత్తర ప్రాంతాల్లోని ఎత్తైన ప్రాంతాలపై మంచు కురిసే అవకాశం ఉందని, రానున్న కాలంలో వడగళ్ల వర్షం కురిసే అవకాశం ఉందని ఆయన హెచ్చరించారు.
తాజా వార్తలు
- సౌదీ అరేబియాలో నాలుగేళ్లలో వచ్చే బ్యాంకు సెలవులు..!!
- డ్యూటీ ఫ్రీ డ్రా.. $1 మిలియన్ గెలుచుకున్న కేరళ వాసి..!!
- యూనివర్శిటీ స్ట్రీట్‌లో రోడ్డు మూసివేత: అష్ఘల్
- కువైట్ లో భారత రాయబారి పనితీరుపై ప్రశంసలు..!!
- AI లో ఇండియా-బహ్రెయిన్ మధ్య సహకారం..!!
- మాదకద్రవ్యాల వాడకాన్ని తగ్గించేందుకు 'హయా' ప్లాట్‌ఫామ్..!!
- టెర్మినల్–1 ఫ్లైట్ రెస్టారెంట్–విమానం ఎక్కిన ఫీలింగ్‌తో భోజనం
- బ్రహ్మోత్సవాల్లో ఇస్రో సేవలు తొలిసారి శాటిలైట్ ఆధారంగా భక్తుల గణన: బిఆర్ నాయుడు
- పాకిస్తాన్ సంచలన నిర్ణయం..
- జెనీవాలో దోహాపై ఇజ్రాయెల్ దాడిని ఖండించిన 78 దేశాలు..!!