'బూస్టర్ డోస్ కోసం పేర్లను నమోదు చేసుకోండి'
- January 19, 2022
కువైట్: యాంటీ కరోనా వైరస్ వ్యాక్సిన్ 'థర్డ్ బూస్టర్ డోస్' తీసుకోవడానికి ప్రైవేట్ నర్సరీల యజమానులు తమ ఉద్యోగుల పేర్లను నమోదు చేసుకోవాలని సోషల్ ఎఫైర్స్, కమ్యూనిటీ డెవలప్మెంట్ మంత్రిత్వ శాఖ అండర్ సెక్రటరీ అబ్దుల్ అజీజ్ షుయబ్ పిలుపునిచ్చారు. జనవరి 27న సాల్మియా ప్రాంతంలోని ప్రైవేట్ నర్సరీల్లోని కార్మికులందరికీ కరోనా వైరస్ వ్యాక్సిన్ వేయించేందుకు క్యాంపెయిన్ ను ప్రారంభించనున్నట్లు అజీజ్ తెలిపారు. నర్సరీ యజమానులు తమ ఉద్యోగులకు వైరస్ బారిన పడకుండా వ్యాక్సిన్లు వేయడానికి గతంలో నిర్వహించిన టీకా ప్రచారాల సందర్భంగా నర్సరీ యాజమాన్యం అందించిన సహకారాన్ని ఆయన ప్రశంసించారు. రెండవ డోస్ తీసుకున్న 6 నెలలు దాటిన వారికి మూడవ బూస్టర్ డోస్ ఇవ్వబడుతుందన్నారు. నర్సరీల యజమానులు https://forms.gle/piTjusAgbpHjGHAv5 అనే వెబ్సైట్ లింక్ ద్వారా రిజిస్టర్ చేసుకోవాలని సూచించారు. ప్రతి ఒక్కరూ ఈ క్యాంపెయిన్లో పాల్గొనాలని షుయబ్ పిలుపునిచ్చారు.
తాజా వార్తలు
- సౌదీ అరేబియాలో నాలుగేళ్లలో వచ్చే బ్యాంకు సెలవులు..!!
- డ్యూటీ ఫ్రీ డ్రా.. $1 మిలియన్ గెలుచుకున్న కేరళ వాసి..!!
- యూనివర్శిటీ స్ట్రీట్లో రోడ్డు మూసివేత: అష్ఘల్
- కువైట్ లో భారత రాయబారి పనితీరుపై ప్రశంసలు..!!
- AI లో ఇండియా-బహ్రెయిన్ మధ్య సహకారం..!!
- మాదకద్రవ్యాల వాడకాన్ని తగ్గించేందుకు 'హయా' ప్లాట్ఫామ్..!!
- టెర్మినల్–1 ఫ్లైట్ రెస్టారెంట్–విమానం ఎక్కిన ఫీలింగ్తో భోజనం
- బ్రహ్మోత్సవాల్లో ఇస్రో సేవలు తొలిసారి శాటిలైట్ ఆధారంగా భక్తుల గణన: బిఆర్ నాయుడు
- పాకిస్తాన్ సంచలన నిర్ణయం..
- జెనీవాలో దోహాపై ఇజ్రాయెల్ దాడిని ఖండించిన 78 దేశాలు..!!