5 - 11 వయస్సు పిల్లలకు వ్యాక్సిన్.. రిజిస్ట్రేషన్ ప్రారంభం
- January 19, 2022
బహ్రెయిన్: 19 జనవరి నుండి 5 నుండి 11 సంవత్సరాల వయస్సు గల పిల్లలకు వ్యాక్సినేషన్ ప్రారంభం కానుంది. ఫైజర్-బయోఎన్‌టెక్ వ్యాక్సిన్ కోసం రిజిస్ట్రేషన్ ప్రారంభిస్తున్నట్లు ఆరోగ్య మంత్రిత్వ శాఖ ప్రకటించింది. తమ పిల్లలకు వ్యాక్సిన్ వేయించాలనుకునే తల్లిదండ్రులందరినీ బీఅవేర్ యాప్ లేదా మంత్రిత్వ శాఖ వెబ్సైట్: healthalert.gov.bh ద్వారా నమోదు చేసుకోవాలని ఆరోగ్య మంత్రిత్వ శాఖ కోరింది. సీ్త్ర మాల్లోని వ్యాక్సినేషన్ సెంటర్లో వ్యాక్సిన్‌ను అందించనున్నట్లు మంత్రిత్వ శాఖ పేర్కొంది. వ్యాక్సిన్ కోసం నమోదు చేయడానికి చట్టపరమైన సంరక్షకుని సమ్మతి అవసరం. అలాగే వ్యాక్సిన్ వేసేటప్పుడు పిల్లలతోపాటు తప్పనిసరిగా పెద్దలు కూడా ఉండాలని మంత్రిత్వ శాఖ వెల్లడించింది.
తాజా వార్తలు
- ఈ నెల 30 వరకు ఏపీ అసెంబ్లీ
- రాహుల్ గాంధీ మరో బాంబు..మీడియా ముందుకు ‘సాక్ష్యాలు’..
- మోడీ కి ఘనంగా విషెస్ తెలిపిన బుర్జ్ ఖలీఫా
- సామాన్యుడి సైతం అందుబాటులో విమాన ప్రయాణం: కేంద్ర మంత్రి రామ్మోహన్
- సౌదీ అరేబియాలో నాలుగేళ్లలో వచ్చే బ్యాంకు సెలవులు..!!
- డ్యూటీ ఫ్రీ డ్రా.. $1 మిలియన్ గెలుచుకున్న కేరళ వాసి..!!
- యూనివర్శిటీ స్ట్రీట్‌లో రోడ్డు మూసివేత: అష్ఘల్
- కువైట్ లో భారత రాయబారి పనితీరుపై ప్రశంసలు..!!
- AI లో ఇండియా-బహ్రెయిన్ మధ్య సహకారం..!!
- మాదకద్రవ్యాల వాడకాన్ని తగ్గించేందుకు 'హయా' ప్లాట్‌ఫామ్..!!