వలసదారుల రుసుము: దేశం విడిచి వెళ్ళిన 1.05 మిలియన్ల మంది విదేశీయులు

- January 19, 2022 , by Maagulf
వలసదారుల రుసుము: దేశం విడిచి వెళ్ళిన 1.05 మిలియన్ల మంది విదేశీయులు

సౌదీ అరేబియా: 2018 నుంచి 2021 మూడో త్రైమాసికం వరకు.. అంటే మొత్తంగా 45 నెలల్లో 1.05 మిలియన్ల మంది వలసదారులు సౌదీ ఎంప్లాయిమెంట్ మార్కెట్‌ని వీడి వెళ్ళారు. మొత్తం విదేశీ కార్మికుల్లో ఈ మొత్తం 10.12 శాతం. దీనికి ప్రధాన కారణం వలసదారుల ఫీజు అని పలు నివేదికలు చెబుతున్నాయి. 2018లో 400 సౌదీ రియాల్స్‌గా వున్న ఈ ఫీజు, 2019 నాటికి 600 సౌదీ రియాల్స్‌కి చేరుకంది. 2020 నాటికి 800 సౌదీ రియాల్స్ అయ్యింది వలసదారుల రుసుము. వలసదారుల రుసుము విధించకముందు నాన్ సౌదీ వర్కర్లు 10.42గా వున్నారు. 2021 చివరి నాటికి ఇది 9.36కి చేరుకుంది.

 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com