మనీ లాండరింగ్: 9 మంది సభ్యుల ముఠాపై విచారణ
- January 19, 2022
యూఏఈ: మోసాలు, దొంగతనాల ద్వారా సేకరించిన సొమ్ము ద్వారా మనీ లాండరింగ్ కార్యకలాపాలకు పాల్పడుతున్న 9 మంది సభ్యుల ముఠాని కోర్టుకు రిఫర్ చేయాలని ప్రాసిక్యూషన్ ఆదేశాలు జారీ చేసింది. బ్యాంకు ఉద్యోగులుగా వ్యవహరిస్తూ, ఖాతాదారుల్ని నిందితులు దోచుకుంటున్నట్లు విచారణలో తేలింది. బాధితుల బ్యాంక్ అక్కౌంట్ల సమాచారాన్ని వివిధ రూపాల్లో సేకరించి నిందితులు మోసాలకు పాల్పడుతున్నారు. అలాగే, ఆయా బ్యాంకుల్ని ఫోర్జరీ ద్వారా నిందితులు కొల్లగొట్టినట్లు కూడా అభియోగాలున్నాయి. నిందితులకు అత్యధికమైన స్థాయిలో శిక్ష విధించాలని న్యాయస్థానాన్ని కోరనున్నట్లు పబ్లిక్ప్రాసిక్యూషన్ పేర్కొంది. 300,000 దిర్హాములకు తగ్గకుండా 10,000,000 దిర్హాములకు మించకుండా నిందితులకు జరీమానా పడాల్సి వుంది.
తాజా వార్తలు
- బంగ్లాదేశ్ అధ్యక్షుడి రాజీనామా..
- అమెరికా స్థావరాలకు దూరంగా వెళ్లండి: ఇరాన్ హెచ్చరిక
- దుబాయ్ విమానాశ్రయంలో కొత్త సదుపాయం..
- సైబర్ నేరాలపై సాంకేతికతే అత్యంత శక్తివంతమైన ఆయుధం: డీజీపీ సీ.వీ.ఆనంద్
- టర్కీలో విషాదం.. నీటిలో కొట్టుకుపోయి సౌదీ పౌరుడు మృతి..!!
- ముహర్రక్ సూక్లో మళ్లీ పార్కింగ్ సౌకర్యం..!!
- ఖతార్లో డిజిటల్ పేమెంట్స్ జోరు.. జూన్లో రికార్డు లావాదేవీలు..!!
- గుడ్న్యూస్.. అబుదాబిలో రెండు కొత్త బస్ లైన్స్ ప్రారంభం..!!
- వాణిజ్య ఉల్లంఘనలపై కువైట్ కఠిన చర్యలు..!!
- భారత విదేశాంగ మంత్రితో ఒమన్ విదేశాంగ మంత్రి భేటీ..!!







